రియల్‌ స్టోరీలో సూర్య!

By Inkmantra - January 08, 2020 - 10:00 AM IST

మరిన్ని వార్తలు

మిడిల్‌ క్లాస్‌ కలలు కల్లలుగానే మిగిలిపోతుంటాయి. అరుదుగా మాత్రమే నిజమవుతుంటాయి. అలా ఓ మిడిల్‌ క్లాస్‌ కుర్రోడు ఓ ఎయిర్‌లైన్స్‌ సంస్థను ఏర్పాటు చేయాలని కలలు కంటుంటాడు. టాటా, బిర్లా వంటి వాళ్లకే తగని కలను కంటున్నాడంటూ ఆ యువకున్ని అందరూ హేళన చేస్తుంటారు. కానీ, కసిగా తన కలను నెరవేర్చుకోవాలనుకుంటాడు ఆ కుర్రోడు. ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా. ఈ ఇంట్రెస్టింగ్‌ స్టోరీలోని యువకుని పాత్రలో తమిళ హీరో సూర్య నటిస్తున్నాడు. 'గురు' ఫేమ్‌ సుధా కొంగర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ్‌తో పాటు, తెలుగులోనూ స్టార్‌ ఇమేజ్‌, మంచి మార్కెట్‌ సంపాదించుకున్న హీరో సూర్య. కానీ, ఈ మధ్య తెలుగులో సూర్య సినిమాలు అంతగా ఆడడం లేదు.

పెద్దగా బిజినెస్‌ కూడా జరగడం లేదు. కానీ, లేటెస్ట్‌ మూవీ విషయానికి వస్తే, ఓ ఇన్‌స్పైరింగ్‌ స్టోరీతో తెరకెక్కుతోంది కాబట్టి, ఒకవేళ సూర్యకి కలిసొచ్చే ఛాన్సుందేమో. బలమైన కథతో పాటు, కమర్షియల్‌ యాంగిల్‌లో కథనం సిద్ధం చేశారట దర్శకురాలు సుధా కొంగర. ఈ సినిమాలో మోహన్‌ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. లేటెస్ట్‌గా రిలీజ్‌ అయిన టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. చూడాలి మరి, సూర్య ఈ సినిమాతో మ్యాజిక్‌ చేస్తాడేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS