అత్యాచారం మాత్రమే నేరం కాదంటోన్న 'నటి'.!

మరిన్ని వార్తలు

'నటి' అని ఎందుకు ప్రస్థావించాల్సి వచ్చిందంటే, తాను హీరోయిన్‌ని కాదని గతంలో ఆమెనే స్వయంగా చెప్పుకొచ్చింది. అందుకే అలా వాడాల్సి వచ్చింది. ఇంతకీ ఎవరీ 'నటి' అనే కదా మీ అనుమానం. నానితో 'జెర్సీ' సినిమాలో నటించింది కదా.. మై నేమ్‌ ఈజ్‌ శ్రద్ధా శ్రీనాధ్‌ అంటూ పదే పదే చెప్పుకుంది కదా.. హా.! ఆమె శ్రద్ధా శ్రీనాద్‌. ఈ భామ తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేస్తూ, మీడియాలో హాట్‌ టాపిక్‌ అయ్యింది.

 

పెళ్లి చేసుకున్నా, తాను మాత్రం పిల్లిల్ని కననంటోంది. ఇందులో కొత్తేముంది.. అందం తరిగిపోతుందనేమో.. అనుకుంటే పప్పులో కాలేసినట్లే. సమాజంలో పెరిగిపోతున్న అకృత్యాల కారణంగా ఆమె అలా డిసైడ్‌ అయ్యిందట. అవును ఈ రోజుల్లో అమ్మాయిలైనా, అబ్బాయిలైనా పెంచడం చాలా కష్టమే. ఇద్దరి విషయంలోనూ భయపడాల్సిన పరిస్థితులే. ఒకప్పుడు కేవలం అమ్మాయిల విషయంలోనే భయపడాల్సి వచ్చేది.

 

కానీ, ఇప్పుడలా కాదు. ఈ సంగతి కాసేపు పక్కన పెడితే, ఈ శాండిల్‌ వుడ్‌ బ్యూటీ ప్రస్తుతం ప్రస్థావించిన అతి ముఖ్యమైన అంశంమేంటంటే, 'అత్యాచారం' నేరంగా పరిగణిస్తున్న ఈ రోజుల్లో అది మాత్రమే నేరం కాదు. అమ్మాయిల్ని చెడు దృష్టితో చూడడం కూడా అతి పెద్ద నేరంగా పరిగణించాలంటోది. అమ్మాయిల భద్రతకు భంగం కలిగించడం, అగౌరవం కలిగేలా ప్రవర్తించడం, వారి మనోభావాల్ని కించపరిచడం.. ఇలాంటివన్నీ ఘోరమైన నేరాలగానే పరిగణించాలని శ్రద్ధా విన్నవించింది. అదండీ అసలు సంగతి. బాగుంది కదా. ఇకపోతే శ్రద్ధా శ్రీనాధ్‌ నటించిన 'జోడీ' చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS