ఈ సారి ఇంకొంచెం మసాలా.. అంటూ బుల్లితెరపై బిగ్‌బాస్ హోస్ట్‌గా నాని ఊరిస్తున్నట్లుగా ఈ సారి ఇంకొంచెం సెక్సీ అంటూ ఎప్పటికప్పుడే తనలోని హాట్‌నెస్‌ని అంచెలంచెలుగా విసిరేస్తోంది అందాల భామ శ్రద్ధా దాస్. అంతకుమించిన హాట్‌నెస్, అభినయం సంగతి సరేసరి.. ఇన్ని ఉన్నా అమ్మడికి అవకాశాలే అంతకంతకూ అరుదైపోతూ వస్తున్నాయి. ఈ మధ్య 'గరుడవేగ' చిత్రంలో తళుక్కున మెరిసింది ఈ హాట్ బ్యూటీ. కానీ ఈమె తళుకులు కేవలం ప్రోమో పోస్టర్స్‌కే పరిమితమయ్యాయి తప్పితే, సినిమాలో ఆమెకు అంత సీను లేకుండా పోయింది. మెడలో ప్రెస్ ఐడీ కార్డు వేసుకుని, మైకు పట్టుకుని హీరో వెనక పరుగులు పెట్టడం తప్పితే అంతకు మించి ప్రాధాన్యత లేదు ఈ సినిమాలో శ్రద్ధాదాస్ పాత్రకు. ఏదో ఒకటిలే అనుకుని ఒప్పుకుని ఉంటుంది. పాపలో కావాల్సినంత గ్లామర్ ఉంది. ఎలా ఉపయోగించుకోవాలో తెలియడం లేదంతే. చూద్దాం అమ్మడి గ్లామర్‌కి తగ్గ ఆఫర్ ఎప్పటికి దక్కుతుందో. ప్రస్తుతానికి ఈ పిక్ చూసి ఆస్వాదించండి. సో హాట్ సో సెక్సీ కదా. కాస్త శ్రద్ధగా చూడండి మరి.