కేరళ రాష్ట్రాన్ని అనూహ్యంగా వరదలు ముంచెత్తగా, అంతే స్థాయిలో కేరళ పట్ల సానుభూతి కూడా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సెలబ్రిటీలు పెద్దయెత్తున విరాళాల్ని కేరళ వరద బాధితుల కోసం ప్రకటిస్తున్నారు.
అయితే దురదృష్టవశాత్తూ సెలబ్రిటీలు ప్రకటించిన విరాళాలకు పదింతల మొత్తాన్ని పేర్కొంటూ సోషల్ మీడియాలో కొందరు దురభిమానులు దుష్ప్రచారం చేసేస్తున్నారు. క్రికెటర్ విరాట్ కోహ్లీ 80 కోట్ల దాకా విరాళమిచ్చాడని సోషల్ మీడియాలో ప్రచారం జరగ్గా, ఆ ప్రచారాన్ని కోహ్లీ సన్నిహితులు ఖండించాల్సి వచ్చింది. విజయ్ విషయంలోనూ ఇదే జరిగింది.
హాట్ బ్యూటీ సన్నీలియోన్ 5 కోట్ల విరాళం ప్రకటించిందని వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తల్ని ఖండించిన సన్నీలియోన్ 1200 కిలోల బియ్యం, పప్పు అందిస్తున్నట్లు ప్రకటించింది. భర్త డేనియల్ వెబర్, మరికొందరి సహకారంతో విరాళాలు, వస్తువులు సేకరించి కేరళ వరద బాధితులకు అందించడానికి ప్రయత్నిస్తున్నామని సన్నీలియోన్ చెప్పింది. కొన్నాళ్ళ క్రితం కేరళకు వెళ్ళిన సన్నీలియోన్‌కి అక్కడ అభిమానులు బ్రహ్మరథం పట్టారు.
ఎంతలా అంటే, మలయాళ సూపర్ స్టార్‌ని మించి సన్నీలియోన్‌కి ఆతిథ్యం లభించింది. దాంతో కేరళ పట్ల సన్నీలియోన్ ప్రత్యేకమైన మమకారం పెంచుకుంది. కేరళకు ఒక్కసారి సాయం చేస్తే సరిపోదనీ, వీలైనంత ఎక్కువ సాయం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటానని పేర్కొంది సన్నీలియోన్. నిజంగానే సన్నీలియోన్ ది గ్రేట్ ఈ విషయంలో.