హీరోయిన్గా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది కానీ, ఇప్పుడు సాదా సీదా క్యారెక్టర్స్‌తో సరిపెట్టుకోవాల్సి వస్తోంది ముద్దుగుమ్మ శ్రద్దాదాస్‌కి. ఫిజిక్‌లో ఉండాల్సినంత గ్లామర్ ఉంది కానీ, కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్స్ లేవు పాపం ఈ బ్యూటీకి. ఇటీవల 'గరుడవేగ' చిత్రంలో ఓ న్యూస్ ఛానెల్ రిపోర్టర్‌గా కనిపించింది. అంతే ఆ తర్వాత పెద్దగా ఆఫర్లు రాలేదు ఈ బ్యూటీకి.
యాక్టింగ్ టాలెంట్ ఉంది. గ్లామర్‌లో లిమిట్స్ లేవు. ఎలాంటి గ్లామర్ క్యారెక్టర్ అయినా చేస్తుంది. అలాగే పర్ఫామెన్స్లోనూ ఇరగదీస్తుంది. అయితే మాత్రం ఒకే ఒక్క ఛాన్స్. తానేంటో నిరూపించుకోవడానికి. అదే వరించడం లేదు. అయినా కానీ తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉంది. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా నటించింది. కానీ ఎక్కడా సరైన గుర్తింపు దక్కలేదీ భామకి.
తన ఉనికిని తెలియపరుచుకునేందుకే సోషల్ మీడియాలో ఇలా హాట్ హాట్ ఫోటోలతో రెచ్చిపోతూ ఉంటుంది. ఇది చూసైనా మన శ్రద్ధాపై కాస్త శ్రద్ద పెట్టండయ్యా బాబూ. చూశారుగా ఈ ఫోటోలో ఆమె హొయలు, వయ్యారాలు, కైపులు, విరుపులు. అదే కదా మన శ్రద్దా గ్లామర్ స్పెషాలిటీ.