బాలీవుడ్లో బిజీయెస్ట్ హీరోయిన్ అయిన శ్రద్ధాకపూర్ తెలుగులో 'సాహో' సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. తెలుగులో 'సాహో'లో నటిస్తూనే బాలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో నటిస్తోంది.
ముఖ్యంగా బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్‌గా తెరకెక్కుతోన్న చిత్రం కోసం శ్రద్ధాకపూర్ పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. ఏదో సినిమా కోసం అన్నట్లుగా కాకుండా, సీరియస్‌గా బ్యాడ్మింటన్ నేర్చుకుంటోంది శ్రద్దా ఈ సినిమా కోసం. అంతే కాదు, ఇప్పటికే బ్యాడ్మింటన్‌లో చాలా మెలకువలు నేర్చుకుందట. ఆటలు ఆడటం వల్ల మనసుకు ఎంత ఉల్లాసంగా ఉంటుందో తెలిసిందే. అయితే బ్యాడ్మింటన్ మరీ ప్రత్యేకం అంటోంది శ్రద్ధాకపూర్.
ఈ సినిమా కారణంగా ఇప్పుడు బ్యాడ్మింటన్ తన జీవితంలో ఓ పార్ట్ అయిపోయిందనీ చెబుతోంది. కొన్ని గంటల పాటు బ్యాడ్మింటన్ కోర్టులోనే కాలం గడిపేస్తోందట శ్రద్ధాకపూర్. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సినిమా రిలీజ్ కానుంది. అయితే సినిమా అయిపోయాక బ్యాడ్మింటన్‌కి స్వస్థి చెప్పేయడమే అనుకుంటారేమో. కాదట. సినిమా కోసం కాదట. సీరియస్‌గానే ఈ ఆటను తన లైఫ్‌లో పార్ట్ చేసేసిందట శ్రద్ధాకపూర్. అందుకే ఇకపై కూడా ఈ ఆటను కొనసాగిస్తానని చెబుతోంది.
ఇకపోతే శ్రద్ధా నటిస్తున్న 'సాహో'లో యాక్షన్ సీన్స్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడదలైన 'సాహో' మేకింగ్ వీడియోలో శ్రద్ధా కపూర్ యాక్షన్ సీక్వెన్స్‌ని కూడా శాంపిల్‌గా చూపించారు.