పవర్ ఆఫ్ యాక్షన్‌తో సౌత్‌లోకి అడుగుపెడుతోంది బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్. 'సాహో'తో తొలిసారి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. బాలీవుడ్ భామ కాబట్టి, గ్లామర్‌కి కొరతే ఉండదు. ఇప్పటికే విడుదలైన 'సాహో' స్టిల్స్‌లో శ్రద్ధాకపూర్ గ్లామర్‌తో పిచ్చెక్కించేస్తోంది. డార్లింగ్‌తో రొమాంటిక్ సీన్స్ ఇరగదీసేస్తోంది. గ్లామర్‌తో పాటు, అమ్మడిలో భిన్న యాంగిల్స్ కూడా ఉన్నాయని, తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. 'సాహో' ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటోంది.
బాహుబలితో యూనివర్సల్ స్టార్ అనిపించుకున్న ప్రబాస్‌తో నటించడం చాలా సంతోషంగా ఉందంటోంది. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా కనిపించదు. కానీ, తాజాగా ఓ ఫోటో పోస్ట్ చేసింది శ్రద్ధాకపూర్. కళ్లు చెదిరే రెయిన్బో కలర్స్‌తో డిఫరెంట్ ఎఫెక్ట్ ఇస్తోంది ఈ పిక్. కలర్సే ఈ పిక్కి హైలైట్. హాట్ హాట్ క్లీవేజ్‌ని మాత్రం అందంగా ఎక్స్పోజ్ చేస్తూ క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఆగస్ట్ 30న డార్లింగ్‌తో కలిసి 'సాహో'తో ప్రేక్షకుల ముందుకు రానుంది అందాల శ్రద్ధాకపూర్.