గ్లామ్‌షాట్‌: హాట్‌ అండ్‌ స్పైసీ తాప్సీ!

మరిన్ని వార్తలు

'ఝుమ్మంది నాదం' సినిమాతో క్యూట్‌గా ఎంట్రీ ఇచ్చిన సొట్ట బుగ్గల చిన్నది తాప్సీ పన్ను. మొదట్లో స్కిన్‌ షోతో గ్లామర్‌ డాళ్‌ ఇమేజ్‌నే తెచ్చుకుంది. కానీ, తాప్సీలో తెలియని నటి దాగుందని ఆమె బాలీవుడ్‌లో అడుగు పెట్టేదాకా ఎవరికీ అర్ధం కాలేదు. తనలోని నటిని మరింత పదును పెట్టే దిశగా బాలీవుడ్‌ దర్శక, నిర్మాతలు ఆమెకు అవకాశాల మీద అవకాశాలు ఇస్తూ వచ్చారు. ప్రతీ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ తాప్సీ ప్రత్యేకమైన స్టార్‌డమ్‌ దక్కించుకుంది నార్త్‌లో. ఈ క్రమంలో గ్లామర్‌ డాళ్‌ అనే ఇమేజ్‌ పక్కకు వెళ్లినట్లయ్యింది. కానీ, తనలో గ్లామర్‌ యాంగిల్‌ కూడా అలాగే ఉందని నిరూపించేలా సోషల్‌ మీడియాలో ఈ మధ్య అప్పుడప్పుడూ హాట్‌ అప్పీల్‌తో రెచ్చిపోతోంది తాప్సీ. తాజగా తాప్సీ పోస్ట్‌ చేసిన ఓ పిక్‌ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అయ్యింది. బ్లాక్‌ ట్రాన్స్‌పరెంటెడ్‌ ప్యాటర్న్‌లో ఓ గౌను ధరించింది. సైడ్‌ యాంగిల్‌ పోజిచ్చింది కానీ, క్లీవేజ్‌ సొగసులు పుష్కలంగా ధారపోసిందని చూచాయగా తెలుస్తోంది. కాలిపై ఉన్న టాటూ ఆమెలోని రొమాంటిక్‌ యాంగిల్‌ని బయటపెడుతోంది. లూజ్‌గా వదిలేసిన ఉంగరాల జుట్టు కుర్రకారుకు రా రమ్మని గాలమేస్తున్నట్లుంది. యస్‌.. ఇట్స్‌ రియల్లీ నైస్‌ పిక్‌. తాప్సీ నటించిన 'సాండ్‌ ఖీ ఆంఖ్‌' చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS