బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్ డెడికేషన్ గురించి తెలిసిందే. సినిమా అంటే ప్యాషన్ ఈ బ్యూటీకి. ఎంతో డెడికేటెడ్‌గా పని చేస్తుంది. ఓ సినిమాని ఏదో యాక్టింగ్‌లా కాకుండా ఓ యజ్ఞంలా భావిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అందుకే 'బాఘీ' సినిమాలో తన పాత్ర కోసం మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. అలాగే ఏ కాస్ట్యూమ్‌కైనా, ఏ క్యారెక్టర్‌కైనా ఇట్టే సూటయిపోతుంది. శ్రద్ధా కపూర్ ఏ క్యారెక్టర్ వేసినా, అక్కడ శ్రద్ధా కనిపించదు. ఆ పాత్ర మాత్రమే కనిపిస్తుంది. అలాగే ఫ్యాషన్‌పై కూడా మంచి పట్టుంది ఈ ముద్దుగుమ్మకి. డిఫరెంట్ డిఫరెంట్ దుస్తుల్లో యూత్‌కి ఫ్యాషన్ ఐకాన్‌గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ తెలుగులోకీ ఎంట్రీ ఇవ్వబోతోంది. బాహుబలితో యూనివర్సల్ స్టార్ అయిన ప్రబాస్‌కి జంటగా 'సాహో'లో నటిస్తోంది శ్రద్ధాకపూర్. మరో పక్క బాలీవుడ్లో ఈ ముద్దుగుమ్మ నటించిన ఓ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా, కొత్త సినిమా కోసం కసరత్తులు చేస్తోంది. బాలీవుడ్లో బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోంది శ్రద్ధా కపూర్. ఈ సినిమా కోసం బ్యాడ్మింటన్‌లో స్పెషల్ కోచింగ్ తీసుకుంటోంది శ్రద్ధా. ఎవరి దగ్గర అనుకుంటున్నారా? సెన్సేషనల్ కోచ్ అయిన గోపీచంద్ దగ్గర. ఇండియాకి పతకాలు సంపాదించి పెడుతోన్న పి.వి.సింధుకి, సైనా నెహ్వాల్‌కి శిక్షణ ఇస్తోన్న గోపీచంద్ దగ్గరే డైరెక్ట్‌గా కోచింగ్ తీసుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. ఓ సినిమా కోసం ఇంత చేస్తోన్న శ్రద్దాని అందుకే అభినందించకుండా ఉండలేం. ఈ సందర్భంగా శ్రద్ధా పూర్, సైనా నెహ్వాల్, గోపీచంద్ కలిసి దిగిన ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్.