ఆ హీరోయిన్‌ ఎనర్జీకి ఫ్లాటైపోతున్న ప్రబాస్‌

By iQlikMovies - June 28, 2018 - 16:45 PM IST

మరిన్ని వార్తలు

యంగ్‌ డైరెక్టర్‌ సుజిత్‌ డైరెక్షన్‌లో ప్రబాస్‌ నటిస్తున్న చిత్రం 'సాహో'. ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

బాలీవుడ్‌ నుండి వచ్చినా శ్రద్ధా కపూర్‌ తెలుగు సినిమాల పట్ల చాలా గౌరవ భావంతో ఉన్నట్లు ఆమె మాటల్లో తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం శ్రద్ధాకపూర్‌ని ఏరి కోరి ఎంచుకోవడం జరిగింది. హీరోయిన్‌గా గ్లామరస్‌ పాత్ర మాత్రమే కాదు శ్రద్ధాది ఇందులో. కథకు అత్యంత ప్రాధాన్యత ఉన్న పాత్ర ఇది. హీరోతో పాటు, ఈక్వెల్‌ వెయిట్‌ ఉన్న పాత్ర. యాక్షన్‌ ఓరియెంటెడ్‌ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రబాస్‌తో పాటు పవర్‌ ఫుల్‌ యాక్షన్‌ సీన్స్‌లో శ్రద్ధా కూడా పాల్గొంటోంది. 

సెట్స్‌లో శ్రద్ధా ఎనర్జీకి హీరో ప్రబాస్‌ ఫ్లాటైపోతున్నాడట. ఆమె డెడికేషన్‌కి ఫిదా అయిపోతున్నాడట. అంతేకాదు, ప్రబాస్‌ దగ్గర చిన్న చిన్నగా తెలుగు పదాలు పలకడం కూడా నేర్చుకుంటోందట శ్రద్ధా కపూర్‌. ఈ మధ్యనే బాలీవుడ్‌లో తన మిగిలిన సినిమాలను పూర్తి చేసుకుని బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌ బయోపిక్‌లో నటిస్తోంది. ఇటు తెలుగులో 'సాహో' తర్వాత అవకాశం వస్తే వరుస సినిమాల్లో నటించేందుకూ శ్రద్ధా కపూర్‌ సిద్ధంగా ఉందట. 

ఇప్పటికే బాలీవుడ్‌ భామలు టాలీవుడ్‌ సినిమాల కోసం క్యూ కట్టేస్తున్నారు. టాలీవుడ్‌లో హీరోయిన్‌ కొరత వారికి గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పేందుకు వెనకాడడం లేదు మరి.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS