నానితో ప్రభాస్ హీరోయిన్

మరిన్ని వార్తలు

న్యాచురల్ స్టార్ నానికి మాస్ ఇమేజ్ తెచ్చి పెట్టిన మూవీ దసరా. నానిని పాన్ ఇండియా స్టార్ ని చేసింది కూడా దసరా మూవీనే. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారు. దసరా మూవీ కలక్షన్స్ తో పాటు ఫిలిం ఫేర్, సైమా అవార్డ్స్ లో పలు విభాగాల్లో అవార్డులు కొల్లగొట్టింది. దసరా తరవాత నాని 'హాయ్ నాన్న' సరిపోదా శనివారంతో  వరుస హిట్లు అందుకున్నాడు. ఇప్పుడు నాని నెక్స్ట్ ఫిల్మ్ కి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది. దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో నాని ఒక సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో   హీరో పాత్రతో పాటు హీరోయిన్ పాత్ర కూడా మంచి పవర్ ఫుల్ గా తీర్చి దిద్దారట శ్రీకాంత్ ఓదెల. మొదట ఈ సినిమాకి జాన్వీ కపూర్ పేరు వినిపించింది. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీలో 100 కోట్ల కలక్షన్ హీరోయిన్ వచ్చి చేరింది. 


రీసెంట్ గా బాలీవుడ్ లో  'స్త్రీ 2 ' చిత్రం  ద్వారా భారీ విజయాన్ని అందుకున్న శ్రద్ద ఈ మూవీలో ఫిక్స్ అయ్యిందని సమాచారం. శ్రద్దా కపూర్ బాలీవుడ్ లో వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉంది. ఇప్పటికే తెలుగులో సాహో సినిమాలో ప్రభాస్ తో కలిసి నటించి, తెలుగు ఆడియన్స్ కి కూడా దగ్గరైంది. ఇప్పుడు మళ్ళీ నాని సినిమాలో నటించటానికి రెడీగా ఉంది. కేవలం హిందీ వెర్షన్ స్త్రీ 2 తో 900 కోట్లు వసూళ్లు చేసి ఏ భాషలోనూ ఏ స్టార్ హీరో కూడా సాధించలేని రికార్డ్ ని శ్రద్దా కపూర్ సాధించింది. పాన్ ఇండియా లెవెల్ లో శ్రద్దా కి  ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని శ్రీకాంత్  ఆమెని సంప్రదించినట్లు తెలుస్తోంది. 


సోషల్ మీడియాలో మోదీని మించిన ఫాలోవర్లు ఉన్న శ్రద్దా కపూర్ నాని సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండటం, ఆమె సినిమాలు వరుసగా 100 కోట్ల లిస్ట్ లో చేరటంతో నాని సినిమాపై అంచనాలు పీక్స్ కి చేరాయి. పాన్ ఇండియా సినిమాకి పాన్ ఇండియా హీరోయిన్ లెక్క పర్ఫెక్టుగా ఉందని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నాని శ్రద్దా జంట ఎలా ఉంటుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS