ఒక్క సినిమాతోనే తెలుగులో తన ఉనికిని చాటుకున్న ముద్దుగుమ్మ శ్రద్ధా శ్రీనాధ్. పేరు గుర్తుంది కదా.. శ్రద్ధా శ్రీనాథ్.. అంటూ పదే పదే తన పేరును తెలుగు ఆడియన్స్ మనసులో ఇంజెక్ట్ చేసిందీ భామ 'జెర్సీ' మూవీ టైమ్‌లో. నానితో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడంతో పాటు, పర్ఫామెన్స్ పరంగానూ నానిని డామినేట్ చేసేసింది ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాధ్.
నిజంగానే మంచి టాలెంట్ ఉన్న అమ్మాయి. తెలుగుతో పాటు, కన్నడ, తమిళ, హిందీ సినిమాల్లోనూ శ్రద్ధా శ్రీనాధ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అసలు విషయం ఏంటంటే, ఈ ముద్దుగుమ్మకు టాలెంట్‌తో పాటు, కాసింత సెన్సాఫ్ హ్యూమర్ కూడా ఎక్కువే. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ రీసెంట్గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన పెళ్లిని పురస్కరించుకుని డిఫరెంట్‌గా విషెస్ చెప్పి, సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందీ వెర్సటైల్ బ్యూటీ.
అదేంటీ, మ్యారేజ్ విషెస్ చెప్పి కూడా వైరల్ అవుతారా.? అందులో వింతేముంది.. అనుకుంటున్నారా.? అక్కడే అమ్మడి టాలెంట్‌ని మళ్లీ గుర్తు చేసుకోవాలి. అదేమంటారా.? మామూలుగా మ్యారేజ్ విషెస్ చెప్పేస్తే కిక్కేముంటుంది. అందుకే, సమ్‌థింగ్ స్పెషల్‌గా విష్ చేసింది. 'మరో మంచి నటుడు పెళ్లి అనే ఊబిలోకి దిగాడు. వరుణ్ ధావన్‌ని ఇకపై మనం ఆన్ స్క్రీన్‌పై ఎక్కువగా చూడలేకపోవచ్చు.
సినిమాలో భాగంగా ఈ హీరో వేరే హీరోయిన్స్‌తో రొమాన్స్ చేస్తే అతని భార్య, అత్త వారింటి వాళ్లు ఒప్పుకోకపోవచ్చు. ఇకపై ఆయన హీరో ఓరియెంటెడ్ మూవీస్‌లోనే ఎక్కువగా కనిపించాల్సి వస్తుందేమో.. ' అంటూ ఆయన పర్సనల్ లైఫ్‌నీ, ప్రొఫిషనల్ లైఫ్‌నీ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతాడో పాపం.. అంటూ కాస్త వేడి నిట్టూర్పులు విడుస్తూ, కంగ్రాట్స్ వరుణ్ ధావన్ అంటూ సెటైరికల్‌గా పోస్ట్ పెట్టింది శ్రద్ధా శ్రీనాధ్. భలేగుంది కదా.. అదీ సంగతి.