స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో 'పుష్ప' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేరళలో 'పుష్ప' ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అయితే కరోనా క్రైసిస్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కు సంబంధించి ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది.
అన్నీ సుకుమార్ సినిమాలకు సంగీతం అందించిన దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నారు. సుకుమార్ - దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన అన్నీ సినిమాలు మ్యూజికల్ హిట్సే. ఇక వీరిద్దరికీ బన్నీ లాంటి హీరో తోడైతే ఇక చెప్పేదేముంది? ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారని, ప్రేక్షకుల అంచనాలు అందుకునేలా ఆ పాటను మరింత స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ కూడా ఒక క్రేజీ ట్యూన్ కంపోజ్ చేశారని సమాచారం. ఈ పాటలో బన్నీ సరసన స్టెప్స్ వేసేందుకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ను ఎంచుకున్నారట.
'సాహో' సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రద్ధా కపూర్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. 'ఏబిసిడి-2' లాంటి సినిమాలతో శ్రద్ధ మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతానికి బన్నీ - శ్రద్ధ జోడీ స్టెప్పులు వేస్తే అది ప్రేక్షకులను మాయ చెయ్యడం ఖాయమే.