నేను హీరోయిన్‌ని కాదంటోన్న 'జెర్సీ' భామ!

మరిన్ని వార్తలు

అబ్బా ఏముందిరా.. అనేంత అందం ఉండాలి. విపరీతమైన ఎక్స్‌పోజింగ్‌ చేయాలి. పాటల్లో హాట్‌ హాట్‌గా స్టెప్పులేయాలి.. ఇవీ హీరోయిన్‌ క్వాలిటీస్‌.. సో తాను హీరోయిన్‌ కాదంటోంది 'జెర్సీ' భామ. ఈ భామ మొదట్నుంచీ సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ అనేలానే ఉంది. 'జెర్సీ' టైంలో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. అందరికీ తెలిసిందే. ఇప్పుడు తెలుగులో 'జోడీ' సినిమాతో రాబోతోంది. నానిలాంటి హీరోతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన ఈ భామ నిజానికి 'జోడీ'గా ఆది సినిమాతోనే ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది.

 

అయితే, అనుకోకుండా ఆ సినిమా ఆలస్యమయ్యేసరికి 'జెర్సీ' ముందుకొచ్చేసింది. ఇక ఈ భామ తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ ప్రేక్షకులకూ సుపరిచితురాలే. కన్నడలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయిన 'యూ టర్న్‌'లో శ్రద్ధా శ్రీనాధ్‌నే హీరోయిన్‌. ఇకపోతే, తమిళంలో బిగ్‌ ప్రాజెక్ట్స్‌ ఈ కన్నడ కస్తూరిని కెరీర్‌ తొలి నాళ్లలోనే వరించాయి. 'విక్రమ్‌ వేదా' సినిమాలో ఈ జనరేషన్‌ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి, సీనియర్‌ హీరో మాధవన్‌లతో కలిసి నటించింది. తాజాగా మరో సీనియర్‌ అజిత్‌ కథానాయకుడిగా నటిస్తున్న 'నేర్కొండపార్వై' లో హీరోయిన్‌గా నటిస్తోంది.

 

ఇది తాప్సీ నటించిన 'పింక్‌' రీమేక్‌. తాప్సీ పోషించిన పాత్రలో శ్రద్ధాశ్రీనాధ్‌ నటిస్తోంది.. అంటేనే ఆమె టాలెంట్‌ని తమిళ తంబీలు ఎంతగా గుర్తించాయో అర్ధం చేసుకోవచ్చు. అయితే, ఎంత టాలెంట్‌ ఉన్నా, బిగ్‌ ఆపర్స్‌తో క్రేజ్‌ తెచ్చుకుంటున్నా, తాను మాత్రం హీరోయిన్‌ని కాదని గట్టిగా నొక్కి చెబుతోంది. తాను జస్ట్‌ నటి మాత్రమే అంటోంది. అంటే నటికీ, హీరోయిన్‌కీ డిఫరెన్స్‌ అర్ధమైంది కదా. అమ్మడు హీరోయిన్‌లా విచ్చలవిడిగా గ్లామర్‌ ప్రదర్శించలేనని, ఫీచర్స్‌ పరంగా అందంగా ఉండననీ చెబుతోందన్న మాట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS