శ్రియపై ఈసారి పెద్ద బాధ్యతే పడింది.!

మరిన్ని వార్తలు

బాబీ దర్శకత్వంలో వెంకటేష్‌, నాగచైతన్య మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం 'వెంకీ మామ'. ఆల్రెడీ సెట్స్‌పై ఉందీ సినిమా. ఇకపోతే ఈ సినిమాలో వెంకటేష్‌కీ, నాగచైతన్యకు జోడీగా నటించే ఆ ముద్దుగుమ్మలెవరనే విషయంపై పలు రకాల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో అంతగా క్రేజ్‌ లేని రకుల్‌కి తన సరసన నటించేందుకు పిలిచి మరీ చైతూ అవకాశమిచ్చాడనే టాక్‌ వినిపిస్తోంది ఓ పక్క.

ఇక వెంకీ సరసన నటించేందుకు బాలీవుడ్‌ బ్యూటీ, రీసెంట్‌గా 'కాలా'లో రజనీకాంత్‌ సరసన నటించిన ముద్దుగుమ్మ హ్యూమా ఖురేషి పేరు పరిశీలించారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆమెను పక్కన పెట్టేసి, సీనియర్‌ అయినా అస్సలేమాత్రం క్రేజ్‌ తగ్గని శ్రియని ఎంచుకున్నారనేది తాజా సమాచారమ్‌. ఆల్రెడీ వెంకీ, శ్రియ సక్సెస్‌ఫుల్‌ పెయిర్‌గా అభిమానుల్లో క్రేజ్‌ ఉంది. 'సుభాష్‌ చంద్రబోస్‌', 'గోపాల గోపాల' చిత్రాల్లో నటించారు. అందుకే ఈ పెయిర్‌ అయితేనే సినిమాకి వెయిట్‌ ఉంటుందని భావిస్తున్నారట.

ఇకపోతే ఈ సినిమాలో వెంకీ, చైతూ మామా అల్లుళ్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అంటే ఒకవేళ వెంకీకి జోడీగా శ్రియ ఫిక్సయితే పాత్ర పరంగా చైతూకి శ్రియ అత్త పాత్రలో మెప్పించాల్సి ఉంటుంది. అంటే కాస్త ఏజ్డ్‌ పాత్రే అవుతుంది. కానీ ఇప్పుడు టాలీవుడ్‌లో గ్లామరస్‌ అండ్‌ స్టైలిష్‌ అత్తలకు భలే మంచి గిరాకీ ఉందిలే. అలా శ్రియ ఫస్ట్‌టైం ఇంత పెద్ద తరహా పాత్రలో నటించాల్సి వస్తుంది.

గ్లామర్‌తో పాటు, హుందాతనాన్ని కూడా ప్రదర్శించాల్సి రావడంతో ఆమెపై దర్శకుడు బాబీ పెద్ద బాధ్యత పెట్టినట్లే అవుతుంది. మరో పక్క శ్రియ, మెగా డాటర్‌ నిహారికతో కలిసి లేడీ ఓరియెంటెడ్‌ మూవీతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS