'గుండు సూది గుండు సూది గుచ్చుకుంటే తప్పు నాది.. అంటూ 'ఛత్రపతి' సినిమాలో ప్రబాస్ మనసును గుండుసూదుల్తో పొడిచేసిన ముద్దుగుమ్మ శ్రియ దశాబ్ధ కాలానికి పైగా కుర్రకారును తన అందంతో ఉర్రూతలూగిస్తోంది. వయసు మీద పడినా పై పైకి ఎగబాకుతోంది ఆమె అందం. ఇదిగో ర్యాంప్‌పై రెడ్ అండ్ గోల్డ్ హాట్ క్లీవేజ్‌తో ఆమె హొయలు పోతుంటే, కుర్రకారు గుండెల్ని బలంగా పట్టి గుంజేస్తున్నట్లే ఉంది. హీరోయిన్‌గా బిజీగా గడుపుతున్న తరుణంలోనే ఐటెం సాంగ్స్‌కీ జై కొట్టి తన గ్లామర్‌లోని అంతులేని లోతుల్ని, ఎత్తుల్ని చూపించేసింది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలు పెళ్లి చేసుకుని ఓ ఇంటిదయ్యింది ఈ అందాల భామ. అయినా కెరీర్‌ని కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుతం శ్రియ చేతిలో రెండు సినిమాలున్నాయి. శ్రియ నటిస్తున్న 'వీర భోగవసంతరాయలు' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే మెగా డాటర్ నిహారికతో మరో హీరోయిన్ సెంట్రిక్ మూవీలోనూ శ్రియ నటిస్తోంది.