ఎయిర్‌ హోస్టెస్‌ అవతారమెత్తిన 'ఇష్ట' సఖి

మరిన్ని వార్తలు

'ఇష్టం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న బ్యూటీ శ్రియ. దాదాపు దశాబ్ధ కాలం పైగానే తన నటనతో అందంతో అందర్నీ అలరిస్తోంది. తన ఈ సినీ ప్రయాణంలో ఎన్నో రకాల పాత్రలు పోషించింది శ్రియ. నటనలో ఎంత సీనియారిటీ ఉన్నా, ఏజ్‌లో ఎంత లార్జ్‌గా ఉన్నా కానీ, ఎక్కడా వన్నె తరగని అందంతో కుర్రహీరోయిన్లకు గట్టి పోటీ ఇవ్వడంతో పాటు, వరుస అవకాశాల్ని దక్కించుకోవడంలోనూ అలాగే పోటీ పడుతోంది. 

శ్రియ పని అయిపోయినట్లే అనే మాట లేకుండా కెరీర్‌లో ఇంకా బిజీగానే గడుపుతోంది. ఈ మధ్యనే తన రష్యన్‌బోయ్‌ ఫ్రెండ్‌ని వివాహం చేసుకుని ఓ ఇంటిదైన శ్రియ, యాక్టింగ్‌కి బ్రేక్‌ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయి. వాటిలో ఒకటి 'వీరభోగవసంతరాయలు'. నారా రోహిత్‌, శ్రీవిష్ణు, శ్రీనివాస్‌ రెడ్డి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో శ్రియది అత్యంత కీలక పాత్ర. ఈ పాత్ర కోసమే శ్రియ ఎయిర్‌ హోస్టెస్‌గా మారింది. 

ఎయిర్‌ హోస్టెస్‌ పాత్ర కోసం డిఫరెంట్‌ లుక్‌లోకి వచ్చేసింది శ్రియ. డిఫరెంట్‌ లుక్స్‌ శ్రియకు కొత్తేమీ కాదు. కానీ ఎయిర్‌ హోస్ట్‌స్‌ గెటప్‌లో శ్రియ కెవ్వుకేక పుట్టించేస్తోంది. పెళ్లి తర్వాత శ్రియ నుండి వస్తున్న తొలి చిత్రమిది. త్వరలోనే విడుదల కానుంది. మరోవైపు మెగా డాటర్‌ నిహారికతో కలిసి ఓ డిఫరెంట్‌ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది శ్రియ. ఈ మధ్యనే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. 

ఇంచుమించు హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీ ఇది. ఈ సినిమాలోనూ శ్రియ పాత్ర సరికొత్తగా ఉంటుందట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS