ఫిలిం ఇండస్ట్రీలో సాధారణంగా హీరోయిన్ కి పెళ్ళి అయితే ఇంకా ఆమె కెరీర్ కి ఫుల్ స్టాప్ పడిపోయినట్టే అన్న టాక్ ఉంది. అయితే ఈ మధ్యనే కొంతమంది అలాంటిది ఏమిలేదు అని పెద్ద హిట్స్ కొట్టి మరి నిరూపిస్తున్నారు.
ఇదిలావుండగా ఒక సీనియర్ హీరోయిన్ మాత్రం సినిమాలకి ఇక గుడ్ బై చెప్పాలనుకుంటున్నట్టు ఒక వార్త ఇప్పుడు ఫిలిం నగర్ లో చక్కర్లుకోడుతున్నది. ఇంతకి ఆ హీరోయిన్ ఎవరంటే- శ్రియా శరణ్. దాదాపుగా 15 యేండ్లుగా హీరోయిన్ గా తన సత్తా చాటుతూ వస్తుంది.
అయితే ఈ మధ్యనే తను ప్రేమించినవాడిని వివాహం చేసుకున్నతరువాత ఇక సినిమాల నుండి VRS తీసుకునే యోచనలో ఉందట. ఇప్పటికే చాలా కాలం పాటు లైమ్ లైట్ లో ఉన్న తాను ఇక కొన్నాళ్ళ పాటు ఫ్యామిలీ లైఫ్ గడపాలనే ఆలోచనలో ఉందట.
మరి చూద్దాం.. ఈ ఆలోచనని అధికారికంగా ప్రకటిస్తుందా లేదా అనేది..