శృతిహాసన్‌కి మెగా ఆఫర్‌: ఇది నిజమేనా.?

మరిన్ని వార్తలు

'గబ్బర్‌సింగ్‌' సినిమాతో కెరీర్‌ బిగ్గెస్ట్‌ హిట్‌ కొట్టి, స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న శృతిహాసన్‌ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంది. ఏం చేస్తుందో ఏమో తెలీదు కానీ, ప్రేమ, పెళ్లి అంటూ ఆ మధ్య వార్తల్లో హాట్‌ టాపిక్‌గా నిలిచింది. ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు కానీ, ఆ తర్వాత మాస్‌రాజా రవితేజ సినిమాతో మళ్లీ టాలీవుడ్‌ని ఏలేందుకు రెడీ అవుతోందంటూ గాసిప్స్‌ వచ్చాయి. కానీ ఆ ఆఫర్‌ కూడా హుష్‌ కాకి అయిపోయింది. 

 

ఇక ఇప్పుడు మరోసారి శృతిహాసన్‌ మెగా వార్తల్లో నిలిచింది. మెగా కాంపౌండ్‌లో ఇప్పటికే పవర్‌ స్టార్‌, మెగా పవర్‌స్టార్‌, స్టైలిష్‌ స్టార్‌లతో నటించేసిన శృతిహాసన్‌ ఈ సారి మెగాస్టార్‌నే టార్గెట్‌ చేసింది. మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం 'సైరా' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ సినిమాలో నటించనున్నారు. ఈ సినిమా కోసమే శృతి హాసన్‌ పేరు తెరపైకి వచ్చింది. 

 

ఏంటీ మెగాస్టార్‌కి జోడీ శృతిహాసనా.? అని ఆశ్చర్యపోకండి. కానే కాదు. ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్‌ లేడీ రోల్‌ ఉందట. ఆ రోల్‌ కోసం శృతిహాసన్‌ని పరిశీలిస్తున్నారట. ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయమేంటంటే కొరటాల శివ తెరకెక్కించిన 'శ్రీమంతుడు' సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టింది. అందుకే సెంటిమెంట్‌ పరంగా శృతిని చిన్న క్యారెక్టర్‌ అయినా ఈ సినిమా కోసం తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS