శ్రుతి ఇలా దొరికిపోయిందేంటి..??

By iQlikMovies - October 29, 2018 - 12:41 PM IST

మరిన్ని వార్తలు

క‌న్న‌డ చిత్ర‌సీమ‌లో ఇప్పుడు శ్రుతి హ‌రిహ‌ర‌న్ పేరు మార్మోగిపోతోంది. యాక్ష‌న్ కింగ్ అర్జున్ త‌న‌ని లైంగికంగా వేధించాడ‌ని బాంబు పేల్చి.. సంచ‌ల‌నం సృష్టించిన శ్రుతి - క‌న్న‌డ సీమ‌లో ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌. అయితే అర్జున్ ని ఇరికించాల‌ని చూసిన శ్రుతి.. తాను త‌వ్వుకున్న గోతులో తానే ప‌డింది.

విష‌యం ఏమిటంటే.. అర్జున్‌పై ఇటీవ‌ల బెంగ‌ళూరు పోలీస్ స్టేష‌న్‌లో శ్రుతి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు కాపీ ని చూస్తే... కన్న‌డ వాసుల దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే.. ఫిర్యాదు కాపీలో ఆమెకు పెళ్ల‌య్యింద‌న్న విష‌యం బ‌య‌ట‌కొచ్చింది.  ఇప్పటి వ‌ర‌కూ శ్రుతికి పెళ్లి కాలేద‌నే అనుకుంటున్నారంతా. శ్రుతి కూడా అలానే చెప్పుకొచ్చింది. కానీ ఫిర్యాదు చేసేట‌ప్పుడు భ‌ర్త‌, లేదా తండ్రి పేరు చెప్పాలి క‌దా?  అక్క‌డ శ్రుతి త‌న‌కు పెళ్ల‌యిన విష‌యాన్ని బ‌య‌ట‌పెట్ట‌లేక త‌ప్ప‌లేదు.  

త‌న‌కు చాలా కాలం క్రిత‌మే పెళ్ల‌యింద‌ని, అయితే ఆ విష‌యం బ‌య‌ట‌కు చెబితే త‌న‌కు అవ‌కాశాలు రావ‌ని శ్రుతి భ‌య‌పడిన‌ట్టు తెలుస్తోంది.  త‌న భ‌ర్త‌ని ప‌రిశ్ర‌మ‌లో స్నేహితుడిగా చెప్పుకుని తిరుగుతుంద‌ని, వాళ్లిద్ద‌రికీ పెళ్ల‌యిన విష‌యం ఎవ్వ‌రికీ తెలీద‌ని.. క‌న్న‌డ ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ కేసు వ‌ల్ల అర్జున్ ఇర‌కాటంలో ప‌డిన సంగ‌తి అటుంచితే - శ్రుతినే కొత్త క‌ష్టాలు కొని తెచ్చుకుంది. 

పెళ్ల‌యినా.. ఆ విష‌యం దాచి - భ‌ర్తని స్నేహితుడిగా క‌వరింగు ఇచ్చుకుంటూ వ‌చ్చిన శ్రుతి మాట‌ల్ని ఇప్పుడు క‌న్న‌డ చిత్రసీమ న‌మ్ముతుందా?  అనేదే బిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS