మీటూ ఉద్యమంలో తనూశ్రీ దత్తా వెనక్కి తగ్గడంలేదు. నానా పటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన తనూశ్రీ దత్తా న్యాయపోరాటానికి సిద్ధమైన సంగతి తెల్సిందే. అయితే తనూశ్రీ దత్తాపై 'లెస్బియన్' ఆరోపణలు చేస్తూ బాలీవుడ్ ఐటమ్ బాంబ్ రాఖీ సావంత్, వివాదాన్ని పక్కదారి పట్టించేస్తోంది.
ఈ నేపథ్యంలో తనూశ్రీ దత్తా, ఓ అప్పీల్ చేసింది. తాను లెస్బియన్‌ని కాననీ, పురుషాధిక్య ప్రపంచంలో ఒంటరి పోరాటం చేస్తున్నాననీ, ఈ క్రమంలో సాటి మహిళలు తనకు తోడు వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. తన మీద ఆరోపణలు చేసే ఏ మహిళా సెలబ్రిటీ మీదా తనకు ద్వేషం లేదంటోన్న తనూశ్రీ దత్తా, వారిని తెరవెనుకాల వుండి ఎవరు ఆడిస్తున్నారో తనకు తెలుసంటూ రాఖీ సావంత్ విమర్శలకు ఘాటు సమాధానమిచ్చింది.
ఇదిలా వుంటూ, తనూశ్రీ దత్తా - నానా పటేకర్ లైంగిక వేధింపుల ఘటన, ఇతర పలు ముఖ్యమైన అంశాల్ని ఓ సినిమాగా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తనూశ్రీ బయోపిక్‌గా దీన్ని భావించొచ్చేమో. అయితే ఇందులో తనూశ్రీ దత్తా ఎపిసోడ్‌కి ఎక్కువ ఛాన్స్ ఇస్తూనే, ఇతర అంశాల్ని ఎక్కువగా ఫోకస్ పెడ్తారట. స్క్రిప్ట్ వర్క్ దాదాపు ఓ కొలిక్కి వచ్చిందనీ, త్వరలోనే తనూశ్రీ దత్తాకి మొత్తం స్క్రిప్ట్ వర్క్ విన్పించనున్నారనీ సమాచారమ్.
బాలీవుడ్‌తోపాటు సౌత్‌లోనూ మీటూ వ్యవహారానికి సంబంధించిన అంశాలు ఈ సినిమాలో పొందుపరుస్తారట. అయితే ఈ అంశంపై మాట్లాడేందుకు తనూశ్రీ దత్తా సుముఖత వ్యక్తం చేయడంలేదు.