కృష్ణ‌ని చూపిస్తారా?? లేదా??

By iQlikMovies - October 29, 2018 - 10:28 AM IST

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్ బ‌యోపిక్ అంటే కేవ‌లం ఆయ‌నొక్క‌రి క‌థ కాదు. చాలామంది జీవితాల్ని తెర‌పై చూపించాలి. ఏఎన్నార్‌, సావిత్రి, ఎస్వీఆర్‌, కృష్ణ‌.. ఇలా చాలామందితో ఆయ‌న‌కున్న అనుబంధాన్ని చెప్పాలి.  ఏఎన్నార్ పాత్ర‌లో సుమంత్ న‌టిస్తున్నారు. సో.. అక్కినేని ఫ్యాన్స్‌కి ఇంత‌కంటే శుభ‌వార్త లేదు. మ‌రి కృష్ణ పాత్రలో ఎవ‌రు క‌నిపిస్తారు?  అస‌లు ఈ సినిమాలో కృష్ణ‌కు సంబంధించిన సీన్లు ఏమైనా ఉన్నాయా?  అనే ప్ర‌శ్న‌లు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి.

ముందుగా రాసుకున్న స్క్రిప్టు ప్ర‌కారం ఎన్టీఆర్ బయోపిక్‌లో కృష్ణ‌కు సంబంధించిన స‌న్నివేశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ - కృష్ణ‌ల మ‌ధ్య అనుబంధాన్ని తెర‌పై చూపించాల‌నుకున్నారు. ఆ పాత్ర కోసం మ‌హేష్ బాబు అయితే బాగుంటుంద‌న్న ఆలోచ‌న వ‌చ్చింది. ఈ విష‌య‌మై మ‌హేష్‌ని సంప్ర‌దిస్తే.. ఎలాంటి స్పంద‌న తెలియ‌జేయ‌లేద‌ని స‌మాచారం. `నాన్న గారి పాత్ర‌లో నేను క‌నిపించ‌డం క‌ష్టం` అన్నాడ‌ట‌. అందుకే ఆ పాత్ర లేకుండానే సినిమా పూర్తి చేద్దామ‌నుకున్నారు. కానీ.. ఇప్పుడు ఎలాగైనా మ‌హేష్‌ని రంగంలోకి దింపాల‌ని చిత్ర‌బృందం భావిస్తున్న‌ట్టు స‌మాచారం అందుతోంది. 

క్రిష్‌కీ మ‌హేష్ కీ మంచి అనుబంధం ఉంది. ఇది వ‌ర‌కు వీరిద్ద‌రూ క‌ల‌సి ఓ సినిమా చేయాల‌నుకున్నారు.కానీ కుద‌ర్లేదు. క్రిష్ కోస‌మైనా మ‌హేష్ ఈ సినిమా చేస్తాడ‌ని చెప్పుకుంటున్నారు. అంతేకాదు... మ‌హేష్‌ని ఒప్పించ‌డానికి బాల‌య్యే స్వ‌యంగా రంగంలోకి దిగాడ‌ని స‌మాచారం అందుతోంది. త్వ‌ర‌లో మ‌హేష్‌ని బాల‌య్య క‌లుస్తాడ‌ని, బాల‌య్య అడిగితే మ‌హేష్ నో చెప్ప‌డ‌ని ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.

 

సో... కృష్ణ‌గా మ‌హేష్ బాబు క‌నిపించ‌డం ఖాయ‌మ‌న్న‌మాట‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS