ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా చెలామణీ అయిన శృతిహాసన్ హవా ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. అయితే, లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడిప్పుడే వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. తమిళంలో విజయ్‌సేతుపతితో ‘లాభం’ చిత్రంలోనూ, తెలుగులో మాస్ రాజా రవితేజతో ‘క్రేక్’ చిత్రంతోనూ శృతిహాసన్ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తోంది. ఇదిలా ఉంటే, ఈ మధ్య శృతిహాసన్ లుక్స్‌పై సోషల్ మీడియా వేదికగా కొన్ని రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. శృతిహాసన్ కొత్త లుక్స్‌లోకి మారిపోవడానికి కొన్ని సర్జరీలు చేయించుకుందనేది ఆ రూమర్స్ సారాంశం.. ఈ వార్తపై తాజాగా శృతిహాసన్ స్పందించింది.
‘అవును నిజమే నేను సర్జరీ చేయించుకున్నాను. హార్మోన్స్ ఇమ్‌బ్యాలెన్స్ కారణంగా మానసికంగా, శారీరకంగా కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ కారణంగానే, నన్ను నేను ప్రేమించుకోవడం కోసం సర్జరీ చేయించుకున్నాను..’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇంకేముంది, డైరెక్ట్‌గా తానే సర్జరీ చేయించుకున్నానని ఒప్పుకున్నాక మాట్లాడుకోవడానికి ఇంకేముంటుంది. నెటిజన్స్ నోటికి సింపుల్‌గా తాళాలు పడ్డాయ్. ఇకపోతే, ఏమాటకామాటే చెప్పుకోవాలి.. ఈ కొత్త లుక్స్‌లో నిజంగానే శృతిహాసన్ చాలా చాలా బాగుంది. ఆమె గ్లామర్‌లో ఫ్రెష్ అప్పీల్ కనిపిస్తోంది.