‘మహానటి’లో జెమినీ గణేషన్ పాత్రలో నటించి తెలుగు, తమిళ ప్రేక్షకుల మెప్పు పొందిన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. ఈ సినిమాతో ముఖ్యంగా తెలుగు లోగిళ్లకు బాగా దగ్గరైపోయారాయన. ఆ తర్వాత మళ్లీ తెలుగులో కనిపించకపోయినా, దుల్కర్ సల్మాన్ అంటే, జెమినీ గణేషన్ అని ఠక్కున గుర్తొచ్చేలా ఆ పాత్రకు ప్రాణం పోయడంతో తెలుగు ప్రేక్షకులు ఆయన్ని మర్చిపోలేదు. తాజాగా దుల్కర్ సల్మాన్ మళ్లీ తెలుగు ప్రేక్షకుల్ని పకరిస్తున్నారు ‘కనులు కనులను దోచాయంటే’ సినిమాతో. ఈ డబ్బింగ్ మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డబ్బింగ్ మూవీ అయినా ఈ సినిమాకి ప్రమోషన్స్ బాగా నిర్వహించారు తెలుగులో.
తెలుగమ్మాయి రీతూ వర్మ, దుల్కర్ తో జోడీ కట్టింది ఈ సినిమాలో. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ విలన్‌గా నటించారు. ఇదిలా ఉంటే, తెలుగు ప్రేక్షకుల అభిమానానికి ఇంప్రెస్ అయిన ఈ మయాళ సూపర్ స్టార్, తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేస్తానంటున్నారు. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ వివరాలు వెల్లడిస్తాడట. ఇప్పటికే తెలుగు భాషలో డైలాగులు పలకడం నేర్చుకున్న ఆయన ‘మహానటి’లో ఆయన పాత్రకు ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నారు. తాజా సినిమాలోనూ సొంతంగా డబ్బింగ్ చెప్పారట. ఇకపోతే, ద్కుర్ తండ్రి ముమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. గతంలో కొన్ని తెలుగు చిత్రాల్లో నటించిన ఆయన, ఇటీవలి కాలంలో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి బయోపిక్ అయిన ‘యాత్ర’లో రాజశేఖర్ రెడ్డి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.