తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దూసుకెళ్లిపోతోన్న ముద్దుగుమ్మ శృతిహాసన్. మ్యూజిక్ అంటే ఎంతో ప్రాణం శృతిహాసన్‌కి. తన కంపోజేషన్‌లో ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్‌లు రూపొందించింది. హీరోయిన్‌గా ఎంత బిజీగా ఉన్నా కానీ తనకిష్టమైన మ్యూజిక్‌ని మాత్రం వదలనంటోంది. ఖాళీ దొరికినప్పుడల్లా సంగీతానికి పదును పెడుతూనే ఉంటుందట ఈ ముద్దుగుమ్మ. పాటలు రాయడం, వాటికి మ్యూజిక్ కంపోజ్ చేయడమే కాదు మంచా డాన్సర్ శృతిహాసన్ అన్న సంగతి కూడా తెలిసిందే. అయితే ప్రస్తుతం అమ్మడి దృష్టి పెళ్లి వైపు మళ్లిందని తెలుస్తోంది. అయితే పెళ్లి అంటే పిల్లల కోసమే అని ఈ ముద్దుగుమ్మ చెబుతోంది. ఎందుకంటే శృతికి పిల్లలంటే చాలా ఇష్టమట. అందుకే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని అనుకుంటోందట. బాలీవుడ్‌లో పలువురు నటీమణులు పెళ్లి చేసుకుని పిల్లిల్ని కని మళ్లీ తమ సినీ కెరీర్‌లో బిజీ అయిపోతున్నారు. అలాగే శృతి కూడా భావిస్తోందట. తనలాగే ఓ అందమైన జూనియర్ శృతికి జన్మనివ్వాలని ఆశిస్తోందట. అయితే ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది? ఈ ముద్దుగుమ్మని పెళ్లాడే ఆ అందగాడు ఎవరో మాత్రం చెప్పడం లేదు సుమీ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్న బిగ్ ప్రాజెక్టు 'కాటమరాయుడు'. ఆమె కెరీర్‌కి కొత్త టర్న్ ఇచ్చిన హీరో పవన్ కళ్యాణ్. ఆయనతో కలిసి రెండో సారి నటించే అవకాశం వచ్చినందుకు శృతి మరోసారి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాతో త్వరలోనే శృతి హాసన్ సందడి చేయనుంది.