ఈ యేడాది టాలీవుడ్ కి తొలి సూపర్ హిట్... `క్రాక్` తో దొరికింది. రవితేజ - శ్రుతి హాసన్ కాంబినేషన్ లో రూపొందించిన ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకుడు. ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కథానాయికగా మళ్లీ శ్రుతిహాసన్ నే ఎంచుకున్నట్టు టాక్. ఈ విషయాన్ని శ్రుతి కూడా ధృవీకరించింది.
`'హిందీ రీమేక్ లో నన్ను నటించమని అడిగిన మాట వాస్తవమే. నాకూ.. ఆసినిమాలో నటించాలని వుంది. అన్నీ కుదిరితే... ఈ రీమేక్‌లో నేను కూడా ఉంటా`` అని క్లారిటీ ఇచ్చేసింది. అన్నట్టు క్రాక్ 2 కూడా పట్టాలెక్కే ఛాన్సుంది. ఇందులోనూ.. శ్రతినే కథానాయిక. ``క్రాక్ సమయంలోనే క్రాక్ 2 ఆలోచన వచ్చింది. ఇందులోనూ నేను నటిస్తున్నా. అయితే ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి'' అంటోంది శ్రుతిహాజన్.