ఉప్పెనతో అందరి దృష్టినీ ఆకర్షించాడు.. మెగా హీరో వైష్ణవ్ తేజ్. ఆ సినిమా ఏకంగా 50 కోట్లు రాబట్టింది. దాంతో.. వైష్ణవ్ తదుపరి సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. వైష్ణవ్ - క్రిష్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈసినిమా కోసం ఆహా గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు టాక్.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూతబడ్డాయి. మళ్లీ పూర్వపు వాతావరణం ఎప్పుడు కనిసిస్తుందో తెలీదు. అందుకే.. చాలా సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. దాంతో క్రిష్ సినిమా కూడా ఓటీటీలో విడుదల అవుతుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఆహా కూడా ఈసినిమా కి మంచి రేట్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఆహాకి ఈ సినిమా అమ్ముకుంటే టేబుల్ ప్రాఫిట్ తో బయట పడే ఛాన్సుందట. దాంతో క్రిష్‌కూడా.. ఆహాకే ఇచ్చేయాలని డిసైడ్ అయినట్టు టాక్. తొలి సినిమా 50 కోట్లు చేసింద కదా... రెండో సినిమా అందులో సగమైనా చేయదా? అని ఆలోచిస్తే మాత్రం.. థియేటరికల్ రిలీజ్ కే ఈ సినిమా వెళ్తుంది. ఎంతొస్తే అంత అనుకుంటే మాత్రం ఆహాలో ఈసినిమా చూసేయొచ్చు.