కమల్ హాసన్ కూతురిగా చిత్రసీమలో అడుగుపెట్టినా అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకుంది శ్రుతిహాసన్. నటిగా, సంగీత దర్శకురాలిగా, గాయనిగా తనదైన ముద్ర వేసింది. టాప్ హీరోలందరితోనూ నటించింది. ఇప్పుడు శ్రుతిహాసన్‌కు అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్ ప్రెస్ ఏజెన్సీ ప్రకటించిన ఆసియా ఖండంలోని వందమంది ప్రభావంతమైన వ్యక్తుల్లో శ్రుతిహాసన్‌కు చోటు దక్కించుకున్నారు.
ఓటింగ్ పద్ధతిలో జరిగిన ఎంపిక ఇది. ఈ వందమందిని ఓటింగ్ ద్వారా ప్రజలే ఎన్నుకున్నారు. ఈ జాబితాలో దక్షిణాది నుంచి చోటు సంపాదించుకున్న కథానాయిక శ్రుతి హాసనే. ఈ సందర్భంగా తనకు ఓట్లు వేసిన వాళ్లందరికీ శ్రుతిహాసన్ కృతజ్ఞతలు చెప్పుకుంది. భవిష్యత్తులోనూ అంచనాలను అనుగుణంగా రాణిస్తానని, ప్రేక్షకుల మనసుల్ని రంజింపచేస్తానని మాట ఇచ్చింది. ప్రస్తుతం శ్రుతిహాసన్ తెలుగులో రవితేజ జతగా ‘క్రాక్’ సినిమాలో నటిస్తోంది. పవన్ `వకీల్ సాబ్`లోనూ తనే కథానాయిక.