బుల్లితెరపై హాటెస్ట్ యాంకర్‌గా సత్తా చాటుతున్న ముద్దుగుమ్మ రేష్మీకి వెండితెరతోనూ పరిచయం ఉంది. ఎప్పటి నుండో వెండితెరపై తన అందాలొలికిస్తోంది రేష్మీ. కానీ ఆమెకి కరెక్ట్ గుర్తింపు దక్కింది మాత్రం 'గుంటూర్ టాకీస్' చిత్రంతోనే. ఆ తర్వాత అలాంటి సినిమాలు చాలానే చేసింది రేష్మీ. అన్నీ గ్లామరస్ పాత్రలే. అయితే వాటిలో ఎక్కువ హారర్ మూవీసే కావడం గమనార్హం.
ఈ మధ్య రీసెంట్‌గా రేష్మీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. తనకి సెక్స్ వర్కర్‌గా నటించాలనుందని. అంతే ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు రేష్మీపై ట్రోలింగ్ మొదలెట్టేశారు. రకరకాల కామెంట్స్‌తో రేష్మీకి సెటైర్లు విసురుతున్నారు. దీంతో ఘాటుగా స్పందించిన రేష్మీ, 'సెక్స్ వర్కర్' పాత్ర అంటే అంత ఆషామాషీ కాదు. అసలు రీల్ లైఫ్‌కీ, రియల్ లైఫ్‌కీ డిఫరెన్స్ తెలియడం లేదు చాలా మందికి. సెక్స్ వర్కర్ పాత్ర పోషించడం అంటే అత్యంత సంక్లిష్టమైన వ్యవహారం.
ఆ పాత్ర పోషించిన వారికే అందులోని సులువు బలువులు తెలిస్తాయి. ఆ పాత్రలో చాలా భావోద్వేగాలుంటాయి. వాటన్నింటినీ ఒక ఆర్టిస్టు తనలో చూపించడమంటే ఎంత కష్టమో మీకు చెప్పినా అర్ధం కాదు అని గతంలో ఆ పాత్రను పోషించిన ఆయా నటీమణుల్ని గుర్తు చేసింది. 'వేదం' సినిమాలో అనుష్క వేస్య పాత్రలో కనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాలీవుడ్‌లో కరీనా 'చమేలీ' సినిమాలో ఆ తరహా పాత్రలోనే నటించి మెప్పించింది.
ఇంకా తెలుగులో శ్రియ, ఛార్మి తదితరులు వేస్య పాత్రలు పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న వారే. అలాంటిది నేను నటిస్తే తప్పేముంది. ఇంతవరకూ నాకు అలాంటి ఛాన్స్ రాలేదు. ఒకవేళ వస్తే తప్పకుండా నటిస్తాను అని రేష్మీ చెప్పింది.