అనుమానాలు అక్కర్లేదంటున్న శృతిహాసన్‌

మరిన్ని వార్తలు

ముద్దుగుమ్మ శృతిహాసన్‌ తమిళంలో 'సంఘమిత్ర' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా బరువైన పాత్ర. ఆ పాత్రలో శృతి సరిగ్గా ఒదగగలదా అంటూ పలు అనుమానాలు తలెత్తుతున్నాయి సినీ ప్రియుల్లో. కానీ అలాంటి అనుమానాలు పెట్టుకోవద్దంటోంది ముద్దుగుమ్మ. కెరీర్‌ స్టార్టింగ్‌లోనే 'అనగనగా ఓ ధీరుడు' చిత్రంలో చేసిన పాత్ర బరువైన పాత్రే. నటన కొత్త అయిన ఆ తొలి రోజుల్లోనే ఆ పాత్రతో తనకి మంచి పేరు, గుర్తింపు వచ్చాయంటోంది. ఇలాంటి పాత్రలు చాలా అరుదుగా దక్కుతాయి. అలాంటి పాత్రనే ప్రస్తుతం 'సంఘమిత్ర'లో పోషిస్తోంది శృతి. అలాంటిది ఇప్పుడు తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా పలు చిత్రాలు చేసిన అనుభవం ఉంది శృతిహాసన్‌కి. అదీ కాక నటనలో అనుభవం తన జీన్స్‌లోనే ఉంది. విశ్వ నటుడు కమల్‌ హాసన్‌ తనయ శృతిహాసన్‌. ఆమెని తక్కువగా ఎలా అంచనా వేయగలం. 'సంఘమిత్ర' సినిమా కథ అంతా శృతిహాసన్‌ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఈ సినిమాలో తన పాత్ర కోసం శృతిహాసన్‌ కత్తి యుద్దాలు, గుర్రపు స్వారీలు.. వగైరా విద్యల్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. ఆర్య, జయం రవి ఇతర ప్రధాన తారగణం ఈ సినిమాలో. సుందర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో శృతిహాసన్‌ తన క్యారెక్టర్‌ పరంగా బెస్ట్‌ అవుట్‌ పుట్‌ని ఆడియన్స్‌కి అందిస్తానంటూ నమ్మకంగా చెబుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS