'పటాస్' సినిమాతో అందాల పటాసులు పేల్చిన శృతి సోది, ఆ తర్వాత 'సుప్రీం' సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడం.. ఆ రెండు సినిమాలూ ఘనవిజయం సాధించడం తెలిసిన సంగతులే. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అనే మరో సినిమాలోనూ ఈ బ్యూటీ నటించిందిగానీ, ఆ తర్వాత తెలుగు తెరకు దూరమైపోయింది. ప్రస్తుతం ఈ భామ జాడ ఎక్కడా కన్పించడంలేదు.
అయితే త్వరలో ఈ బ్యూటీని తిరిగి తెలుగు సినీ పరిశ్రమకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. తొలి రెండు సినిమాలూ ఆమె అనిల్ రావిపూడి దర్శకత్వంలోనే చేసింది. అప్పట్లో అనిల్ ఈమెను గోల్డెన్ లెగ్‌గా భావించాడనే ప్రచారం కూడా జరిగింది. ఆ సంగతి పక్కన పెడితే ఓ యంగ్ డైరెక్టర్ శృతి సోదితో చర్చలు జరిపాడనీ, ఆ దర్శకుడు రూపొందించబోయే సినిమాతో ఈ బ్యూటీ తెలుగులోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతోందనీ సమాచారమ్.
అయితే ప్రస్తుతం కాస్త బొద్దుగా మారిన ఈ బ్యూటీ సన్నబడే ప్రయత్నాల్లో వుందట. కొంచెం నాజూగ్గా తయారైతే, తెలుగులో అవకాశాలు తనకు పోటెత్తుతాయనే నమ్మకంతో వుంది శృతి సోది. గతంలో శృతి సోది న్యూస్ రీడర్‌గా కూడా పనిచేసింది. అదీ ఇంగ్లీషు వార్తలు చదివే న్యూస్ రీడర్‌గా కావడం గమనార్హం. స్టయిలిష్‌గా కన్పించే శృతి సోదిలో ఎంత మాస్ యాంగిల్ వుందో 'పటాస్', 'సుప్రీం' సినిమాల్లో చూసేశాం కదా.! ఈసారి ఈ బ్యూటీ రీ-ఎంట్రీ ఎలా వుండబోతోందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.