సిద్దూ సిద్దార్థ రాయ్.. అంటూ ఖుషీలో పవన్ కల్యాణ్ చేసిన విన్యాసాలు మర్చిపోలేం. అలాంటి పవన్ `శ్యామ్ సింగరాయ్`గా కనిపిస్తే ఎలా ఉంటుంది?
నాని కథానాయకుడిగా నటించిన చిత్రం `శ్యామ్ సింగరాయ్`. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. శ్యామ్ సింగరాయ్ 2 తీయాలనుకుంటే, ఏ హీరోతో తీస్తారు? అని రాహుల్ ని అడిగితే.. ''పవన్ తో తీస్తాను. ఎందుకంటే.. ఈ టైటిల్ పవన్ కి పర్‌ఫెక్ట్ గా యాప్ట్ అవుతుంది. ఈ తరహా పాత్రలో పవన్ కనిపిస్తే... అభిమానులకు పూనకాలు వస్తాయి. ఒకవేళ `శ్యామ్ సింగరాయ్` హిట్టయి సీక్వెల్ చేయాలనుకుంటే ముందుగా ఈ కథ పవన్‌కే చెబుతా'' అని చెప్పుకొచ్చాడు రాహుల్.
'టాక్సీవాలా'తో రాహుల్ దర్శకుడిగా తనని తాను నిరూపించుకున్నాడు. అయితే ఆ తరవాతి సినిమాకి చాలా గ్యాప్ వచ్చింది. ఈ విరామంలో చాలా కథలు రాసుకున్నాడు. సత్యదేవ్ రాసిన 'శ్యామ్ సింగరాయ్' కథ నచ్చడంతో....ఆ కథలో నాని అయితే బాగుంటుందనిపించి, అప్పుడు ఈ కథని నానికి వినిపించాడు. నాని కూడా ఓకే అనేశాడు. అందుకే పవన్ గురించి ఆలోచించలేదు. నిజంగానే ఈ టైటిల్, కథ పవన్ కి యాప్ట్ అనుకుంటే, ముందు పవన్‌కే ఈ కథ వినిపించేవాడేమో కదా? అప్పుడు లేని ఆలోచన, ఇప్పుడెందుకు వచ్చినట్టో..?