గత వారం విడుదలైన సినిమా `పుష్ప`. కాస్త డివైడెడ్ టాక్ వచ్చినా, మంచి వసూళ్లే రాబట్టింది. కానీ. ఈ వసూళ్లు సరిపోవు. ఎందుకంటే ఈ సినిమాని భారీ రేట్లకు కొనుక్కున్నారు. వాటిని రాబట్టుకోవాలంటే మరో వారం రోజులైనా.. పుష్ప ఇదే రేంజులో దూసుకుపోవాలి. అయితే ఈ శుక్రవారం నాని సినిమా విడుదల అవుతోంది. బాలీవుడ్ నుంచి 83 వస్తోంది. ఇవి రెండూ. పుష్ప వసూళ్లకు గండి కొట్టే సినిమాలే.
కాకపోతే... పుష్ప బృందం క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవుల్ని నమ్ముకుంది. రాబోయే రోజుల్లో వరుసగా సెలవలు వస్తున్నాయి. ఈ హాలీడేస్.. పుష్పకి కలిసొస్తాయన్నది వాళ్ల నమ్మకం. ఈ శని, ఆదివారాలు కచ్చితంగా పుష్ప మంచి వసూళ్లు రాబట్టాలి. లేదంటే బ్రేక్ ఈవెన్ దాటడం కష్టమే. శ్యామ్ సింగరాయ్‌కి ఏమాత్రం పాజిటీవ్ టాక్ వచ్చినా, పుష్ప వసూళ్లు అమాంతం పడిపోతాయి. మరోవైపు పుష్ప టీమ్ భారీగా ప్రమోషన్లు చేస్తోంది. విడుదలకు ముందు చేసినదానికంటే, విడుదలైన తరవాతే ఎక్కువ ప్రమోషన్లు చేస్తున్నారు. ఈ ప్రభావం వసూళ్లపై పడుతుందన్నది వాళ్ల నమ్మకం. శ్యామ్ సింగరాయ్ విడుదలైతే గానీ, పుష్ప పరిస్థితి చెప్పలేం.