జోనర్‌ మార్చేశాడు గురూ!

మరిన్ని వార్తలు

హారర్‌ కామెడీ చిత్రాలకు జనం అలవాటు పడిపోయారు. ఆ జోనర్‌ నుండి పక్కకు లాగి, మళ్లీ హారర్‌ మూవీ అంటే గతంలోలాగా భయం కల్పించేలా, థ్రిల్‌కి గురి చేసేలా ఉండాలని హీరో సిద్ధార్ద్‌ చేసిన ప్రయత్నం 'గృహం'. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ అస్సలుండదు. అన్నీ భయం కల్పించే అంశాలే. ఎంతో నమ్మకంగా రిస్క్‌ చేసి ఈ సినిమాని తెరకెక్కించారు దర్శకుడు మిళింద్‌ రౌ. సిద్దార్ద్‌ చేసిన ఈ ప్రయత్నం అందరికీ నచ్చింది. చేసింది రిస్కే అయినా సక్సెస్‌ అయ్యాడు. సినిమాకి మంచి టాక్‌ వస్తోంది. హిట్‌ సినిమా అనే టాక్‌ బాగా వినిపిస్తోంది. ఆ సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాడు సిద్దార్ద్‌. అయితే ఇది పూర్తి స్థాయిలో హారర్‌ మూవీ. 

కాబట్టి, ఈ సినిమాకి 'ఎ' సర్టిఫికెట్‌ ఇచ్చారు కాబట్టి, ఈ సినిమాని ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమా కాదంటున్నాడు సిద్దార్ధ్‌. దయచేసి గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, 18 ఏళ్లలోపు వయసున్న పిల్లలు చూడొద్దనీ సిద్దార్ద్‌ చెబుతున్నాడు. స్త్రీలు ఎక్కువగా హారర్‌ బేసెడ్‌ మూవీస్‌ని ఎంజాయ్‌ చేస్తారు. అలాగే తన సినిమాని కూడా మహిళలు ఎక్కువగా ఇష్టపడుతున్నారనీ అంటున్నాడు. ఆండ్రియా హీరోయిన్‌గా నటించింది. ఆండ్రియాకి తెలుగులో ఓ మంచి రెండో సినిమా ఇది. గతంలో 'తడాఖా' సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఈ సినిమాలో బోల్డ్‌ సన్నివేశాల్లోనూ నటించేసింది. హారర్‌కి, ఆ మాత్రం హాట్‌నెస్‌ లేకపోతే, కష్టం అంటున్నాడు సిద్దార్ద్‌. ఆ అప్పియరెన్స్‌ ఈ సినిమాని హాలీవుడ్‌ స్థాయి అంచనాలను పెంచేందుకు ఉపయోగపడిందంటున్నాడు. 

అంతేకాదు, భార్య, భర్తల బంధం సహజత్వాన్ని పెంపొందించేందుకు ఆ సీన్స్‌లో నటించాల్సి వచ్చిందనీ అంటున్నారు ఆయన. అలా సిద్దూ, ఆండ్రియాల మధ్య రొమాంటిక్‌ సన్నివేశాలు చాలా సహజంగా వచ్చాయి. ఆడియన్స్‌ నుండి రెస్పాన్స్‌ కూడా బాగుంది. ఏమాత్రం అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. మొత్తానికి పక్కా హారర్‌ మూవీతో మన చాక్లెట్‌ బోయ్‌ సిద్దూ మంచి హిట్‌ కొట్టేశాడులే!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS