సిద్దీ ఇద్నానీ ఫ్యావరేట్‌ హీరో ఎవరంటే.!

మరిన్ని వార్తలు

ఎవరీ సిద్దీ ఇద్నానీ అనుకుంటున్నారా? లేటెస్టుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'జంబలకిడిపంబ' హీరోయిన్‌ పేరే సిద్దీ ఇద్నానీ. ఈ పాప ఇప్పుడు భలే ఎట్రాక్ట్‌ చేస్తోంది తెలుసా? జూన్‌ 22న 'జంబలకిడిపంబ' విడుదలైంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన అమ్మడి యాక్టింగ్‌కీ మంచి మార్కులే పడుతున్నాయి.  

ఇకపోతే ఈ ముద్దుగుమ్మలో విషయం కూడా బాగానే ఉంది. తొలి సినిమానే అయినా కానీ, ఎన్నో సినిమాలు చేసిన ఎక్స్‌పీరియన్స్‌ ఉన్నట్లుగా నటించింది. అయితే ఈ ముద్దుగుమ్మకి ఫేవరేట్‌ హీరో ఎవరో తెలుసా? శ్రీనివాస్‌ రెడ్డి అట. కామెడీగా ఉంది కదా. ఈయన కమెడియన్‌ కదా అనుకుంటున్నారా? ఈమె నటించిన సినిమాలో హీరో ఆయనే కదా. అందుకే తెలివిగా తన ఫేవరేట్‌ హీరో శ్రీనివాస్‌ రెడ్డి అని బిస్కెట్‌ వేసింది. ఆ తర్వాత ప్రబాస్‌, చరణ్‌, ఎన్టీఆర్‌ అని కవర్‌ చేసేసింది. 

చూస్తుంటే ఈ బ్యూటీ టాలీవుడ్‌లో మరిన్ని స్టెప్పులు ఎక్కేసేలానే అనిపిస్తోంది. స్వతహాగా గుజరాతీ భామ అయిన సిద్దీ ఇద్నానీ అప్పుడే తెలుగు పదాలను అర్ధం చేసుకుంటోంది. త్వరలోనే తెలుగులో మాటాడేందుకు కూడా సిద్ధమంటోంది. చాలా చాలా యాక్టివ్‌గా కనిపిస్తోంది. ఫస్ట్‌ సినిమాకే పర్‌ఫామెన్స్‌ ఓరియెంటెడ్‌ రోల్‌ దక్కడం తన అదృష్టమంటోంది. సెట్స్‌లో శ్రీనివాస్‌ రెడ్డి తనకు చాలా సహకరించాడనీ, డైలాగ్స్‌ అర్ధం చేసుకోవడంలోనూ, వాటిని అనుకరించడంలోనూ శ్రీనివాస్‌ రెడ్డి సహాయం తనకెంతో ఉపయోగపడిందనీ చెబుతోందీ ముద్దుగుమ్మ.

 

అంతేకాదు, గ్లామర్‌లో కూడా పెద్దగా హద్దులు లేవట ఈ భామకి. సో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా నిలదొక్కుకోవడానికి ఈ ముద్దుగుమ్మకి ఏమంత కష్టం కాదనిపిస్తోంది. చూడాలిక అమ్మడి భవిష్యత్‌ ఎలా ఉండబోతోందో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS