బాహుబలి తరవాత అనుష్క బాగా లావైపోయింది. బాహుబలి 2లోనే ఆ మార్పు కనిపించింది. ఇదే ఆకారంతో `సైలెన్స్` సినిమా కూడా చేసేస్తోంది. అయితే... బరువు తగ్గడానికి అనుష్క చేస్తున్న ప్రయత్నాలేం సఫలం అవ్వడం లేదని తెలుస్తోంది. దానికి తోడు సైడ్ ఎఫెక్ట్స్ రూపంలో ఆరోగ్య సమస్యలు కూడా వచ్చాయని, అనుష్క కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులలో ఉందని సన్నిహితులు చెబుతున్నారు.
అందుకోసమే కేరళలో ప్రత్యేకంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కేరళ ప్రకృతి వైద్యానికి ప్రసిద్ది. అనుష్కకీ అలాంటి ట్రీట్మెంటే జరుగుతోందని సమాచారం. బరువు తగ్గితే, అన్ని సమస్యలూ తొలగిపోతాయని వైద్యులు సూచించార్ట. అందుకు సంబంధించి స్వీటీ ప్రత్యేకండా డైట్ తీసుకుంటోంది. అనుష్క కోసం చాలామంది దర్శక నిర్మాతలు కాచుకుని ఉన్నారు. కానీ స్వీటీ మాత్రం ఎవ్వరికీ రెస్పాండ్ అవ్వడం లేదు. తన ఆరోగ్య సమస్యలన్నీ ఓ కొలిక్కి వచ్చాక, బరువు తగ్గాక... అప్పుడు కొత్త కథల కోసం ఆలోచిస్తానంటోందట.