AAA సినిమా నిర్మాత ఆ చిత్రంలో నటించిన హీరో శింబు పైన చేసిన ఆరోపణల పైన ముందు నాకు ఏమి తెలియదు అని దాటేసిన సదరు హీరో ఇప్పుడు ఆ విషయంలో వెనక్కి తగ్గినట్టు తెలుస్తున్నది.
నిన్న చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ- AAA చిత్రం ఫ్లాప్ అయింది అన్నది నిజం. అది మొదలుపెట్టినప్పుడు ఒకే చిత్రంగా తీద్దాము అని అనుకున్నా మధ్యలో రెండు భాగాలుగా చేద్దాము అని అనుకున్నాము. దీనితో ప్రొడక్షన్ ఖర్చు పెరగడం జరిగింది, అయితే తన పై ఆరోపణలు చేసిన నిర్మాత ఆ ఆరోపణలని చిత్రం విడుదలైన వెంటనే చేసి ఉండొచ్చు లేదా ఒక నెల తరువాత చేసి ఉండొచ్చు.
అలాంటిది ఇంత కాలం ఆగి చేయడం వెనుక ఏమై ఉంటుందో ఊహించగలం అని చెప్పుకొచ్చాడు. తానేమి మంచి వ్యక్తి అని ఎప్పుడు చెప్పుకోలేదు అలాగే ఇక్కడ ఇండస్ట్రీ లో తనని ఇష్టపడకపోతే వేరే ఇండస్ట్రీలో పని చేసుకుంటాను అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
మొత్తానికి శింబు క్షమించండి అని అంటూనే అందరికి షాక్ కూడా ఇచ్చాడు.