తమిళంలో భారీ మల్టీ స్టారర్‌గా.!

By iQlikMovies - November 15, 2018 - 17:27 PM IST

మరిన్ని వార్తలు

16 ఏళ్ల క్రితం శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన 'ఇండియన్‌' చిత్రం రికార్డులు కొల్లగొట్టింది. తెలుగులో 'భారతీయుడు' పేరుతో విడుదలై ఇక్కడ కూడా సెన్సేషన్‌ సృష్టించింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమాకి సీక్వెల్‌ వస్తుందంటే అంచనాలు ఆకాశాన్ని అంటడం సహజమే. 

అలాగే ఆ అంచనాల్ని నిజం చేసే దిశగా చిత్ర యూనిట్‌ కూడా పావులు కదుపుతోంది. ఈ సినిమాకి కాస్టింగ్‌తోనే భారీ క్రేజ్‌ తీసుకురావాలనుకుంటోంది. అందుకే భారీ కాస్టింగ్‌ని ఈ సినిమాలో నిక్షిప్తం చేయాలనుకుంటోంది. విశ్వనటుడు కమల్‌హాసన్‌కి జోడీగా మన చందమామ కాజల్‌ అగర్వాల్‌, సౌత్‌ క్వీన్‌ నయనతార ఆల్రెడీ సెట్‌ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. అలాగే మలయాళ ప్రముఖ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ కూడా ఈ సినిమాలో భాగమయ్యాడట. 

అయితే తాజాగా మరో నటుడి పేరు కూడా తెరపైకి వచ్చింది. తమిళ నటుడు శింబుని ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ఎంచుకోనున్నారనీ కోలీవుడ్‌ వర్గాల సమాచారమ్‌. ఒకవేళ ఇదే నిజమైతే తమిళంలో ఇదో పెద్ద మల్టీ స్టారర్‌ అవుతుందని భావిస్తున్నారు. ఇంతేకాదట. ఇంకా చాలా మంది ప్రముఖ నటీ నటుల పేర్లు ఈ సినిమాలో చేర్చే దిశగా చర్చలు జరుగుతున్నాయనీ తెలుస్తోంది. 

'రోబో 2.0' సినిమా తర్వాత శంకర్‌ నుండి వస్తున్న సినిమా ఇది. టెక్నికల్‌గా ఈ సినిమాని కనీ వినీ ఎరుగని స్థాయిలో తెరకెక్కించనున్నారనీ తెలుస్తోంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో '2.0' రూపొందించిన లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లోనే 'ఇండియన్‌ 2' రూపొందనుంది. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి సెట్‌ వర్క్స్‌ స్టార్ట్‌ అయిపోయాయి. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS