ఇలాగైతే అల్లూవారి ప‌రువు ఏమైపోతుందో..?

By Gowthami - April 04, 2020 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

గీతా ఆర్ట్స్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌ద్ధ‌తైన సినిమాలే వ‌చ్చాయి. గీతా ఆర్ట్స్ 2 లోనూ అంతే. ఫ్యామిలీ కంటెంట్‌కి పెద్ద పీట వేస్తుంది గీతా. ఈమ‌ధ్యే అల్లు అర‌వింద్ అండ్ కో... ఆహా అంటూ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వైపు అడుగులేసింది. ఇప్ప‌టి వ‌ర‌కూ `ఆహా` అనుకునే కంటెంట్ ఏదీ ఇందులో రాలేదు. లేటెస్టుగా `సిన్‌` అనే వెబ్ సిరీస్‌ని దింపింది. ఈ `సిన్ `ట్రైల‌ర్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దానికి కార‌ణం.. ఇందులో ఉన్న బోల్డు కంటెంట్‌. సాధార‌ణంగా వెబ్ సిరీస్ ల‌లో చాటు మ‌ట్టుకు అడ‌ల్ట్ కంటెంట్ తోనే ముస్తాబ‌వుతున్నాయి. యూత్‌ని టార్గెట్ చేస్తూ, మ‌సాలా క‌థ‌లు అల్లుకుంటూ - వాళ్ల బ‌ల‌హీన‌త‌ల‌ను క్యాష్ చేసుకుంటున్నాయి.

 

అయితే.. తెలుగులో మాత్రం ఇది ఇంకా మితిమీర‌లేదు. అంతా ఓ స్థాయికే ప‌రిమితమైంది. ఆహాలో ఇప్ప‌టి వ‌ర‌కూ అడ‌ల్ట్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ రాలేదు. `సిన్‌` మాత్రం అందుకు విరుద్ధం. ఈ ట్రైల‌ర్‌లో సెక్స్ ప‌చ్చిగా చూపించేశారు. ట్రైల‌ర్ లోనే ఇంత ఉందంటే... వెబ్ సిరీస్ కోసం ఇంకెంత దాచారో..? కంటెంట్ లోనూ కావ‌ల్సినంత మ‌సాలా ఉంది. చూస్తుంటే యూత్‌ని ఈ వెబ్ సిరీస్ ఆక‌ట్టుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. కానీ... అల్లూ వారి ప‌రువు ఏమైపోతుందో అనిపిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ క్లీన్ ఇమేజ్ ఉన్న సినిమాలనే తీసింది ఈ సంస్థ‌. కానీ ఓటీటీ అలా కాదు క‌దా. ఇక్క‌డ వ్యాపారం పూర్తిగా వేరు. అడ‌ల్ట్ కంటెంట్ లేక‌పోతే, ఆక‌ట్టుకోవ‌డం క‌ష్టం. అందుకే గీతా ఆర్ట్స్ కూడా ఆ దిశ‌గా అడుగులేసిందేమో..?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS