తమ్మూ ఆశలు బాలీవుడ్‌ నెరవేర్చేనా?

మరిన్ని వార్తలు

మిల్కీబ్యూటీ తమన్నా ఇటు తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అప్పుడెప్పుడో 'హిమ్మత్‌వాలా' సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన తమన్నా, ఇక అక్కడే తిష్ట వేసేయకుండా, సౌత్‌ సినిమాలను ఫుల్‌ టైమ్‌ కెరీర్‌గానూ, నార్త్‌ని పార్ట్‌ టైమ్‌ కెరీర్‌గా కొనసాగిస్తూ వస్తోంది. అవకాశమొచ్చినప్పుడల్లా ఒకటీ, అరా బాలీవుడ్‌ సినిమాలతో సరిపెట్టుకుంటోంది.

 

పూర్తిగా అక్కడే ఆశలు పెట్టుకుంటే కష్టం కానీ, ఏదో టైం పాస్‌గా పెట్టుకుంది కాబట్టి, అక్కడి సక్సెస్‌, ఫెయిల్యూర్స్‌ తమన్నా కెరీర్‌కి పెద్దగా ఎఫెక్ట్‌ కాలేదు. ఇకపోతే తాజాగా తమన్నా బాలీవుడ్‌లో ఓ కొత్త ప్రాజెక్ట్‌ ఓకే చేసింది. 'బోలే చుడియాన్‌' అనే కొత్త సినిమాకు సైన్‌ చేసింది. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ ఓ ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌ పోషిస్తున్న ఈ సినిమాకి షమాస్‌ నవాబ్‌ సిద్ధిఖీ దర్శకుడు. ఈయన ఎవరో కాదు, హీరో నవాజుద్దీన్‌ సిద్దిఖీకి స్వయానా సోదరుడే.

 

అన్నయ్య నవాజుద్దీన్‌తో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని రూపొందిస్తున్నాడీయన. మరోవైపు తమన్నా ఇటీవలే అక్కడ 'ఖామోషీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రభుదేవా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాతో తమన్నాకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. కానీ, 'దేవీ' సిరీస్‌ చిత్రాలు అక్కడ కూడా ఓ మోస్తరు పేరు తెచ్చుకున్నాయి. ఇక తెలుగులో త్వరలోనే తమన్నా 'సైరా' చిత్రంతో ఆలరించనుంది. ఈ సినిమాలో తమన్నా ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తోన్న సంగతి తెలిసిందే. తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'క్వీన్‌' రీమేక్‌ 'దటీజ్‌ మహాలక్ష్మీ' కూడా విడుదలకు సిద్ధంగానే ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS