సూర్య హీరోగా వచ్చిన సింగం సిరీస్ కి దక్షిణాది చిత్రసీమలోనే కాకుండా బాలీవుడ్ లోన కూడా మంచి ఆదరణ ఉంది. అందుకే సింగం మొదటిభాగాన్ని హిందీలో రీమేక్ చేశారు.
ఇక పోయిన ఏడాది చివరిలో విడుదల అయిన సింగం 3 ని ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేసే యోచనలో ఉన్నారు. ఈ చిత్రాన్ని హిందీలో ప్రముఖ ఛాయాగ్రహకుడు అయిన రవి కె చంద్రన్ దర్శకత్వం వహించనున్నట్టు వినికిడి.
ఈ చిత్రంలో కథానాయకుడిగా సన్నీ డియోల్ నటించనున్నట్టు తెలుస్తున్నది. అయితే ప్రస్తుతం ఈ రీమేక్ పనులు మొదటిలోనే ఉన్నట్టు రాబోయే సమయంలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉన్నట్టు సమాచారం.