తమిళనాట హీరోని హీరోగా కాకుండా ఓ దైవంలా చూస్తారు అనేదాని పైన ఎటువంటి సందేహం లేదు. అలాగే తమ హీరో పైఎవరన్నా నోరు జారితే వారిని అంత తేలిగ్గా వదిలిపెట్టారు.
ఇక వివరాల్లోకి వెళితే, తమిళనాడులో ధన్యా రాజేంద్రన అనే ఓ జర్నలిస్ట్ తన ట్వీట్స్ లో హీరో విజయ్ నటించిన ఒక చిత్రం గురించి తక్కువగా చేసి మాట్లాడింది అంటూ సదరు హీరో ఫ్యాన్స్ ఆమె పైన ఫైర్ అయ్యారు, ఏకంగా వేళ సంఖ్యలో ఆమెని తిడుతూ ట్వీట్స్ చేశారు.
ఈ సంఘటన జరగడానికి కారణం ఏంటంటే- ఆమె ఈ మధ్యనే విడుదలైన ఓ హిందీ చిత్రాన్ని చూస్తుండగా అది నచ్చక మధ్యలోనే వచ్చేశానని, ఇంతకముందు కూడా ఒకసారి హీరో విజయ్ నటించిన ఓ చిత్రం విషయంలో ఇలానే జరిగి బయటకి రావడం జరిగిందంటూ ఆమె చేసిన ట్వీట్ దుమారం రేపింది.
మూడురోజుల పాటు ఆమెని తన ట్వీట్స్ తో ఇబ్బందికి గురిచేయగా, ఆమె పోలీసులని ఆశ్రయించింది. ఇక పోలీసులు కూడా ఈ అంశం పై విచారణ మొదలుపెట్టారు.