త్రివిక్రమ్ గనుక, ‘పలాస’ సినిమా చూసుంటే.!

By Inkmantra - March 04, 2020 - 14:00 PM IST

మరిన్ని వార్తలు

‘అల వైకుంఠపురములో’ సినిమా కోసం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ విలన్‌గా పరభాషా నటుడు సముద్రఖనిని తీసుకొచ్చిన విషయం విదితమే. ఇక, త్వరలో విడుదలకు సిద్ధమవుతోన్న ‘పలాస’ సినిమా విడుదలకు ముందే సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ చిత్రానికి సంగీతం అందించడమే కాదు, ఇందులో నెగెటివ్‌ రోల్‌లో కన్పిస్తున్నాడు సంగీత దర్శకుడు రఘు కుంచె. సినీ పరిశ్రమకు ఎప్పుడో సింగర్‌గా, సంగీత దర్శకుడిగా పరిచయమైనా, స్టార్‌డమ్ ఇంకా అతనికి అందలేదు. అయితే, ‘పలాస’ సినిమాతో అటు సంగీత దర్శకుడిగా, ఇటు నటుడిగా మంచి పేరు ముందే దక్కుతోంది రఘు కుంచెకి.

 

ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ సందర్భంగా ప్రముఖ సినీ పాటల రచయిత సిరాశ్రీ మాట్లాడుతూ, ‘అల వైకుంఠపురములో’ సినిమా కంటే ముందే ‘పలాస’ సినిమా విడుదలయి వుంటే, ఆ సినిమాని త్రివిక్రమ్ శ్రీనివాస్‌ చూస్తే.. తన సినిమాలో విలన్‌ కోసం త్రివిక్రమ్, సముద్రఖనిని కాకుండా రఘు కుంచెని ఎంచుకుని వుండేవారేమోనని అభిప్రాయపడ్డారు. నిజమే, ‘పలాస’ సినిమా ప్రమోషన్స్‌లో రఘు కుంచెని చూస్తే, ఆ తరహా ఇంటెన్సివ్‌ లుక్స్‌తోనే కన్పిస్తున్నారనిపిస్తుంది.

 

దర్శకుడు కాశీ విశ్వనాథ్‌, సినీ నటుడిగా మారి సత్తా చాటుతున్న విషయం విదితమే. అలా, రఘు కుంచె కూడా ముందు ముందు నటుడిగా తనలోని భిన్న కోణాన్ని మరింతగా ఎలివేట్‌ చేసేలా పలు పాత్రల్లో కన్పిస్తారేమో.! ఇదిలా వుంటే, ‘పలాస’ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. వాస్తవిక ఘటనల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS