SIT- డ్రగ్స్ కాంట్రవర్సీ మొదలయిన నాటి నుండి ఈ పేరుకి రెండు తెలుగు రాష్ట్రాలలో విశేషమైన ఆదరణ లభించిందనే చెప్పాలి.
ఇక నెలక్రితమే మొదటి దఫా విచారణ ముగించిన SIT బృందం, ఇప్పుడు మరోసారి రెండో దఫా విచారణలకి శ్రీకారం చుట్టనుంది. తెలియవస్తున్న వివరాల ప్రకారం, SIT వారు సినీ పరిశ్రమ నుండి ముగ్గురికి నోటిసులు ఇవ్వనున్నారట.
ఈ ముగ్గురిలో ఒక బడ హీరోయిన్, మరో ఇద్దరేమో ప్రముఖ సినీ కుటుంబాలకి చెందిన వారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం. డ్రగ్స్ మాఫియా కి సంబంధించి ఈ ముగ్గురి పాత్ర పై త్వరలోనే SIT నుండి నోటిసులు అందనున్నాయి అని అలాగే వీరి విచారణ కోసం పక్కా ప్రణాళికను సిద్దం చేసుకోబుతున్నాటు తెలుస్తున్నది.
అయితే, ఈసారి SIT నోటిసుల వ్యవహారం ఎంతటి సంచలనం రేపనుందో చూడాలి.