'సీత' అంటే ఆ పేరులోనే ఓ వినయం, విధేయత, పవిత్రత అన్నీ దాగి ఉంటాయి. కానీ మన తేజగారి 'సీత' మాత్రం పేరుకే కానీ, తీరులో పైన చెప్పుకున్న క్వాలిటీ ఒక్కటి కూడా ఉండదు మరి. ట్రైలర్ చూస్తుంటే ఆ విషయం ఆల్రెడీ అర్ధమైపోయింది. అయితే 'సీత'తో ఏదో కొత్త ప్రయత్నం చేయబోతున్నాడు తేజ అని మాత్రం ఆడియన్స్ ఫిక్సయిపోయారు. అయితే, ఆ కొత్తదనంతో ఆడియన్స్ మనసు దోచుకుంటాడా.? లేదా.? అనే విషయం తెలియాలంటే, మే 24 వరకూ ఆగాల్సిందే.
ఇక తేజ వైపు నుండి చూస్తే, ఈ సినిమా విజయంపై పూర్తి నమ్మకంగా ఉన్నారు. కటౌట్ కాదు, కంటెంటే మాట్లాడుతుంది.. ఆడియన్స్‌ని మాట్లాడుకునేలా చేస్తుంది.. అని ఆయన ధీమాగా చెబుతున్నారు. ఇకపోతే, 'సీత' పాత్రలో కాజల్ అగర్వాల్ పొగరూ, బలుపూ బాగా ప్రదర్శిస్తోంది. క్యూట్‌గా హాట్‌గా కనిపించిన కాజల్ ఈ సినిమా కోసం చాలా ర్యూడ్‌గా మారిపోయింది. తనలో వచ్చిన ఈ మార్పుకు ఫ్యాన్సే షాకవుతున్నారు. మరి ఈ షాకింగ్ ఛేంజ్‌తో మన చందమామ ఎలాంటి రిజల్ట్‌ని అందుకుంటుందో ఇప్పుడప్పుడే చెప్పలేం.
హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మ్యాటర్‌కొస్తే, ఇంతవరకూ మాస్ హీరోగా, పవర్‌ఫుల్ పర్‌ఫామెన్స్ ఇచ్చేందుకే ఇష్టపడిని బెల్లంకొండ సడెన్‌గా 'సీత' కోసం రాముడు మంచి బాలుడిలా మారిపోయాడెందుకో. ఇదే ఇప్పటికీ ఎవ్వరికీ అర్ధం కాని విషయం. ఏది ఏమైనా తన తోటి హీరోలు ప్రయోగాలు చేసేస్తుంటే, తానేం తక్కువ తినలేదనుకున్నాడో ఏమో, 'సీత'తో ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. మరి మన రాముడి అమాయకత్వం మోడ్రన్ సీత పొగరు దించుతుందా.? లెట్స్ వెయిట్ అండ్ సీ.!