వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా `సీతారామం`. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి మంచి రివ్యూలు వచ్చాయి. ఓపెనింగ్స్ కూడా డీసెంట్ గానే ఉన్నాయి. ఈ వీకెండ్ లో.. కమర్షియల్ గా... సీతారామం జాతకం ఏమిటన్నది తేలిపోతుంది. అయితే... ఈ సినిమా విడుదలకు ముందే సేఫ్ అని ట్రేడ్ వర్గాలు లెక్కగట్టాయి.
సీతారామం సినిమాకి దాదాపుగా రూ.45 కోట్ల బడ్జెట్ అయ్యిందని టాక్. డిజిటల్, శాటిలైట్ నుంచి దాదాపుగా రూ.20 కోట్లు వచ్చేసినట్టు తెలుస్తోంది. హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలోనూ బాగానే వచ్చాయని సమాచారం. థియేటరికల్ నుంచి రూ.10 కోట్లు వచ్చినా సరిపోతాయి. అలాంటిది ఈ సినిమాకి థియేటరికల్ బిజినెస్ దాదాపు 20 కోట్ల వరకూ జరిగిందని టాక్. అంటే విడుదలకు ముందే రూ.10 కోట్ల లాభమన్నమాట. దుల్కర్ సల్మాన్ - హను రాఘవపూడి కాంబినేషన్ పై రూ.45 కోట్లు పెట్టడం ఓ విశేషమైతే, విడుదలకు ముందే నిర్మాతలు రూ.10 కోట్ల టేబుల్ ప్రాఫిట్ చూడడం మరో విశేషం. మొత్తానికి వైజయంతీ మూవీస్ ఖాతాలో మరో హిట్టు పడిపోయినట్టే. రష్మిక కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం ద్వారా ముంబై భామ మృణాల్ ఠాకూర్ కథానాయికగా పరిచయమైన సంగతి తెలిసిందే.