ప్రభాస్ రాముడిగా `ఆది పురుష్` ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టేశారు. బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైపోయినట్టు టాక్. నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని ముందే లాక్ చేసి పెట్టుకుంటున్నార్ట.
ప్రభాస్ రాముడు అనగానే.. సీత ఎవరు? అనే ప్రశ్న మొదలైపోయింది. ఫలానా నటి సీత అయితే బాగుంటుందని ప్రభాస్ అభిమానులూ ఓ లిస్టు తీస్తున్నారు. అనుష్క అయితే సీతకు పర్‌ఫెక్ట్ అని చాలామంది నమ్మకం. ప్రభాస్ - అనుష్కలది సూపర్ హిట్ జోడీ. వీరిద్దరి మధ్య ఏదో ఎఫైర్ నడుస్తుందన్న టాక్ కూడా ఉండడంతో.. సీత గా స్వీటీ పేరు తెగ చక్కర్లు కొడుతోంది.
కాకపోతే.. చిత్రబృందం మాత్రం సీత ని వెదికి పట్టేశారని టాక్. `మహానటి` కీర్తి సురేష్ అయితే సీత పాత్రకు బాగా సెట్టవుతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారని తెలుస్తోంది. పైగా ప్రభాస్ - కీర్తి.. ఫ్రెష్ కాంబినేషన్. అందుకే.. కీర్తి వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయని టాక్.