పవన్ కళ్యాణ్‌పై నటి శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలపై నటుడు, హీరో శివబాలాజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్‌పై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలపై ఆయన రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి దోషిగా తేలితే, కనీసం ఐదేళ్లు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయనీ తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ అంటే నటుడు శివబాలాజీకి చాలా ఇష్టం, అభిమానం. సొంత అన్నయ్యగా భావిస్తాడు పవన్ కళ్యాణ్‌ని శివబాలాజీ. ఈ ఇద్దరూ కలిసి 'కాటమరాయుడు' సినిమాలో అన్నదమ్ముల్లా నటించారు. ఆ టైంలోనే బర్త్‌డే సందర్భంగా పవన్ కళ్యాణ్ కోసం ఓ ప్రత్యేక ఖడ్గాన్ని తయారు చేయించి, పవన్ కళ్యాణ్‌కి గిఫ్ట్‌గా ఇచ్చి, తన అభిమానాన్ని చాటుకున్నాడు శివ బాలాజీ. అలాంటి తన అభిమాన హీరోని నోటికి వచ్చినట్లు తిడితే ఊరుకుంటాడా?
అందుకే ఇమీడియట్‌గా స్పందించాడు. స్పందించడమే కాదు, ముందు వెనకా ఆలోచించకుండా లీగల్‌గా ప్రొసీడ్ అయిపోయాడు కూడా. ఆల్రెడీ పవన్‌పై శ్రీరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను ఆమెపై అభిమానం గళం దండెత్తింది. అన్ని వైపులా శ్రీరెడ్డి తీరును నిరసిస్తోంది. ప్రముఖులు కూడా పవన్‌పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పు పడుతూ తమదైన శైలిలో ఘాటుగా స్పందిస్తున్నారు. చాలా మంది అభిమానులు ఆమెపై ఆల్రెడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కోవలో ఇప్పటికే శ్రీరెడ్డిపై చాలా కేసులు నమోదయ్యాయి. శ్రీరెడ్డి 'కాస్టింగ్‌కౌచ్' అనే ఉద్యమం కాస్తా, టర్న్ తీసుకుని పవన్‌పై దుర్భాషలాడడంతో పక్కదారి పట్టి, చివరికి ఇదిగో ఇలా వివాదాస్పదమైంది.