సోహెల్ ప్రెగ్నెంట్ అయ్యాడ‌ట‌!

మరిన్ని వార్తలు

బిగ్ బాస్ తో ఫేమ్ సంపాదించుకున్నాడు సోహెల్. త‌న‌కు వెండి తెర నుంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. అందులో భాగంగా ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. దీనికి `మిస్ట‌ర్ ప్రెగ్నెంట్` అనే టైటిల్ పెట్టారు. ఓ మ‌గాడు గ‌ర్భం దాల్చ‌డ‌మే ఈ సినిమాలోని వెరైటీ. మ‌గాడికి క‌డుపెందుకుకొచ్చింది? ఎలా వ‌చ్చింది? ఇదంతా సాధ్య‌మేనా? అనేది తెర‌పై చూడాలి. శ్రీ‌నివాస్ వింజ‌నం పాటి ద‌ర్శ‌కుడు. రూపా కొడ‌వారియ‌ర్ క‌థానాయిక‌.

 

చిత్రీక‌ర‌ణ దాదాపుగా పూర్త‌య్యింది. త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తారు. ఆదివారం.. ఓ చిన్న టీజ‌ర్ విడుద‌ల చేశారు. అందులో మిస్ట‌ర్ ప్రెగ్నెంట్ పాత్ర‌ని రివీల్ చేశారు. బాలీవుడ్ లో ఈ త‌ర‌హా సినిమా ఒక‌ట్రెండు వ‌చ్చాయి. అప్పుడెప్పుడో తెలుగులో రాజేంద్ర ప్ర‌సాద్ హీరోగా `అప్పారావు నెల త‌ప్పాడు` అనే సినిమా వ‌చ్చింది. కానీ.. అందులో హీరోని నిండు గ‌ర్భిణిగా మాత్రంచూపించ‌లేదు. `మిస్ట‌ర్ ప్రెగ్నెంట్`లో మాత్రం ఆ సాహ‌సం చేశారు. మ‌రి వెండి తెర‌పై ఈ ప్ర‌యోగం ఏ మేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS