'సోలో బతుకే సో బెటర్‌' అంటున్న సుప్రీమ్‌ హీరో!

మరిన్ని వార్తలు

అప్పుడెప్పుడో చెప్పాడు కదా.. అని ఇదేదో మన సుప్రీమ్‌ హీరో పర్సనల్‌ ఒపీనియన్‌ అనుకోకండి. ఇది ఆయన కొత్త చిత్రం టైటిల్‌. అవునండీ నిజమే, బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. టైటిల్‌ చూస్తుంటే ఇదేదో ఆహ్లాదమైన లవ్‌ స్టోరీ అనిపిస్తోంది. పూజా కార్యక్రమాలతో స్టార్ట్‌ అయిన ఈ సినిమా టైటిల్‌ లోగోని కూడా ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.

 

నభా నటేష్‌ ఈ సినిమాలో సాయి ధరమ్‌కి జోడీగా నటించనుంది. నవంబర్‌ నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరగనున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. మరోవైపు సాయి ధరమ్‌ ప్రస్తుతం 'ఊరంతా పండగే' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఇటీవలే రాజమండ్రిలో షెడ్యూల్‌ పూర్తి చేసుకుని హైద్రాబాద్‌ తిరిగొచ్చింది.

 

సత్యరాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, సాయి ధరమ్‌తో జత కడుతోంది. నవంబరులోగా ఈ సినిమాని పనులు పూర్తి చేసి, కొత్త సినిమా సెట్స్‌లో సందడి చేయనున్నాడు సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్‌. తమన్‌ ఈ సినిమాకి సంగీతమందిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS